‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి చాలా మంది హాట్ ఫేవరెట్ అయింది. ఆ సినిమా ఆడనప్పటికీ లావణ్యకు మంచి పేరొచ్చింది. దీంతో ఆమెకి అవకాశాలు బాగానే వచ్చాయి కానీ.. ఇన్నేళ్లలో ఆమె ఎప్పుడూ ఒక స్థాయిని మించి మాత్రం ఎదగలేకపోయింది. ఎప్పుడూ చిన్న, మిడ్ రేంజ్ హీరోలతో కలిసి నటించిందే తప్ప పెద్ద హీరోలతో జోడీ కట్టలేదు. పెద్ద దర్శకులు కూడా ఆమెకి అవకాశాలు ఇవ్వలేదు.
ఇప్పుడు ఆమెకి అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఈ ఏడాది ‘ఎ1 ఎక్స్ప్రెస్’, ‘చావు కబురు చల్లగా’ సినిమాల్లో కనిపించింది లావణ్య. ఆ రెండు సినిమాలు వర్కవుట్ అవ్వలేదు. దీంతో ఇక లావణ్య కెరీర్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సడెన్ గా ఆమెకి ఓ భారీ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. అది కూడా మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా కావడం విశేషం. ఇందులో పూజాహెగ్డేను మెయిన్ హీరోయిన్ గా తీసుకోగా..
సెకండ్ హీరోయిన్ గా లావణ్యకు ఛాన్స్ ఇచ్చాడట త్రివిక్రమ్. అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్న లావణ్యకు ఇంత పెద్ద సినిమాలో ఛాన్స్ అంటే ఆమె సంతోషానికి అవధులుండవు. ఈ సినిమాతోనైనా లావణ్యకి బ్రేక్ వస్తుందేమో చూడాలి!