Lavanya Tripathi: లావణ్య వరుణ్ కంటే ముందుగా ఆ హీరో ప్రేమలో పడ్డారా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలోనే ఈమె మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ నిశ్చితార్థం గత నెల ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక త్వరలోనే వీరిద్దరి వివాహ వేడుక కూడా ఎంతో ఘనంగా జరగబోతుంది.ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులకు కూడా ఈ పెళ్లి పనులలో బిజీ అయ్యారు.

ఇకపోతే వరుణ్ తేజ్ కంటే ముందుగా పలువురు హీరోలతో ప్రేమలో ఉన్నారు. అంటూ తరచు తన గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మెగా కాంపౌండ్ లోనే ఈమె సాయి ధరమ్ తేజ్ తో పాటు అల్లు శిరీష్ తో కూడా ప్రేమలో పడ్డారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే మరొక వార్త కూడా వైరల్ అవుతుంది.

లావణ్య త్రిపాటి (Lavanya Tripathi) అందాల రాక్షసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన నవీన్ చంద్రతో ఈమె ప్రేమలో పడ్డారట. వీరిద్దరూ ప్రేమలో ఉండడంతోనే నవీన్ చంద్రతో కలిసి లావణ్య త్రిపాఠి మరో రెండు సినిమాలలో కూడా నటించారు. అయితే ఈ హీరోతో పీకల్లోకి ప్రేమలో ఉన్నటువంటి లావణ్య త్రిపాఠి బ్రేకప్ చెప్పుకోవడానికి కారణం ఏమీ లేదు కేవలం ఆయన ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడమే కారణమని చెప్పాలి.

నవీన్ చంద్ర వరస అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీ అయ్యారు. అయితే ఈయన నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈయనకు క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి ఇలా ఈయనకు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందకపోవటంతోనే లావణ్య త్రిపాటి హీరో నవీన్ చంద్రతో బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus