Lavanya Tripathi: రిసెప్షన్ వేడుకలో చిరు కాళ్ళకు మొక్కిన మెగా కోడలు.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా హైదరాబాద్లో తన వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి కుటుంబ సభ్యుల సమక్షంలో నవంబరు ఒకటవ తేదీ ఇటలీలో పెళ్లి చేసుకున్నటువంటి ఈయన తాజాగా హైదరాబాదులో వివాహ రిసెప్షన్ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం తరలివచ్చారు. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ రిసెప్షన్లో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యి సందడి చేశారు. చిరంజీవి ఈ రిసెప్షన్ వేడుకలో పాల్గొనగానే పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈయన వేదిక పైకి వెళ్ళగా చిరంజీవి గారిని చూడగానే వెంటనే లావణ్య త్రిపాఠి తన మామయ్య కాలపై పడి నమస్కారం చేశారు.

అనంతరం వరుణ్ కూడా తన పెదనాన్న చిరంజీవికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది మెగా అభిమానులు లావణ్య త్రిపాఠి సంస్కారం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరంజీవి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి ఇంటికి ఈమె కోడలుగా వెళ్లారు.

ఇలా మెగా ఇంటికోడలుగా అడుగుపెట్టినటువంటి (Lavanya Tripathi) లావణ్య త్రిపాఠి పెద్దవారికి ఇస్తున్నటువంటి గౌరవ మర్యాదలు చూసి లావణ్య మెగా ఇంటికి సరిగ్గా సరిపోయే కోడలేనని, ఈమె సంస్కారానికి అభిమానులు ఫిదా అవుతూ ఈ ఫోటోలను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus