Lavanya Tripathi: వెడ్డింగ్ రిసెప్షన్ లో లావణ్య కట్టిన చీర ఖరీదు అన్ని లక్షలా?

నటి లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇటలీలో పెళ్లి వేడుకను పూర్తి చేసుకున్నటువంటి ఈ దంపతులు హైదరాబాదులో నవంబర్ 5వ తేదీ రిసెప్షన్ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట రిసెప్షన్ వేడుకకు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలెబ్రెటీల అందరిని కూడా ఆహ్వానించారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున టాలీవుడ్ సెలబ్రిటీలందరూ హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ రిసెప్షన్ వేడుకలలో భాగంగా వధూవరులు ఇద్దరు కూడా చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ తమ వెడ్డింగ్ కోసం ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రతో ప్రత్యేకంగా దుస్తులను డిజైన్ చేయించుకున్నారు. పెళ్లికి అలాగే రిసెప్షన్ కి ఈయన చేత డిజైన్ చేయించుకున్నారని తెలుస్తుంది. ఇక తాజాగా వివాహ రిసెప్షన్ వేడుకలలో భాగంగా వరుణ్ తేజ్ బ్లేజర్ ధరించగా లావణ్య త్రిపాఠి మెటాలిక్ చీర ధరించి మరింత అట్రాక్షన్ గా నిలిచారు.

ఇక ఈమె ధరించిన ఈ చీరను మనీష్ మల్హోత్రా స్పెషల్ గా డిజైన్ చేశారని తెలుస్తుంది. అయితే ఇదివరకే ఇదే చీరను బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కి డిజైన్ చేశారట అయితే అదే డిజైన్ చీరను ఈమె కూడా కోరడంతో తనకు కూడా ప్రత్యేకంగా ఈ చీరను డిజైన్ చేశారని తెలుస్తుంది. ఈ విధంగా రిసెప్షన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నటువంటి ఈ చీర ఖరీదు 2.75 లక్షల రూపాయలు అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ శారీలో లావణ్య త్రిపాటి (Lavanya Tripathi) మరింత అందంగా కనపడుతూ అందరిని ఆకట్టుకున్నారు. పెళ్లి కోసం ఎరుపు రంగు కంచి పట్టుచీరను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నటువంటి ఈమె రిసెప్షన్ కోసం ఈ చీరను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహ రిసెప్షన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus