Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి.. అక్కడైనా సక్సెస్ అవుతుందా..?

  • June 20, 2022 / 02:47 PM IST

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించింది లావణ్య త్రిపాఠి. తన పదేళ్ల కెరీర్ లో ఆమెకి చెప్పుకోదగ్గ హిట్టు సినిమాలు పడలేదు. ఒకట్రెండు సినిమాలు సక్సెస్ అయినా.. ఆ క్రెడిట్ ఆమెకి దక్కలేదు. తన తోటి హీరోయిన్లు స్టార్ డం ఎంజాయ్ చేస్తుంటే.. లావణ్య మాత్రం అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కలుగుతోంది. మొన్నటివరకు మెగాహీరోతో ఆమెకి ఎఫైర్ ఉందని.. అతడిని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఆమెపై వార్తలొచ్చాయి.

అయితే వీటిపై ఇప్పటివరకు స్పందించలేదు ఈ బ్యూటీ. ప్రస్తుతం లావణ్య చేతిలో ‘హ్యాపీ బర్త్ డే’ అనే ఒక్క సినిమా మాత్రమే ఉంది. సినిమా అవకాశాలు తగ్గడంతో డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో ఓ వెబ్ సిరీస్ ఒప్పుకుంది. ‘పులి మేక’ అనే వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించింది లావణ్య త్రిపాఠి. కోనవెంకట్ ఈ సిరీస్ కి కథ అందిస్తుండగా.. చక్రవర్తి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించనున్నారు.

గతంలో ఈ దర్శకుడు గోపీచంద్ హీరోగా ‘పంతం’ అనే సినిమాను రూపొందించారు. ఇప్పుడు అతడు జీ5 ఓటీటీ కోసం వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లోని పోలీసులను టార్గెట్ చేసి.. ఒకరి తరువాత ఒకరిని చంపుతున్న సీరియల్ కిల్లర్ కథే ఈ సిరీస్. థ్రిల్లర్ అంశాలను, జాతకాలను మిక్స్ చేసి రాసిన కథ ఇది.

ఇదే వెబ్ సిరీస్ తో హీరో ఆది సాయికుమార్ కూడా ఓటీటీలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ సిరీస్ లో సీనియర్ నటుడు సుమన్ కూడా నటిస్తున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ తోనైనా లావణ్య త్రిపాఠికి సక్సెస్ వస్తుందేమో చూడాలి!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus