Lavanya Tripathi: ఫ్రెండ్స్ కి బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన లావణ్య ఫోటోలు వైరల్!

నటి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ఇంటికి కోడలు కాబోతున్న విషయం మనకు తెలిసిందే. నటుడు వరుణ్ తేజ్ ని ప్రేమించినటువంటి ఈమె పెద్దలను ఒప్పించి వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికి వీరిద్దరూ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ విధంగా జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఈ జంట నవంబర్ ఒకటో తేదీ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక వీరి వివాహం ఇటలీలో జరగబోతుందని తెలుస్తోంది. ఇక వీరి వివాహం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరుగుతుందని వరుణ్ తేజ్ వెల్లడించారు.

ఇటలీలో వీరి పెళ్లికి సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికీ రామ్ చరణ్ ఉపాసన కూడా ఇటలీ చేరుకున్న సంగతి తెలిసిందే . ఇక లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ కూడా ఇటలీ వెళ్లారని తెలుస్తోంది. లావణ్య త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పారు. స్నేహితులతో కలిసి ఘనంగా బ్యాచిలర్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ పార్టీకి సంబంధించినటువంటి ఫోటోలను (Lavanya Tripathi) లావణ్య త్రిపాఠి నిహారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బ్యాచిలర్ పార్టీలో భాగంగా హీరో నితిన్ భార్య శాలిని, నటి రీతు వర్మ అలాగే నిహారిక వంటి తదితరులు ఈ బ్యాచిలర్ పార్టీలో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ పార్టీ చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో కలిసి ఇటలీ వెళ్లారని తెలుస్తోంది. ఇక వీరి వివాహం నవంబర్ ఒకటవ తేదీ జరగబోతుందని సమాచారం అయితే ఇప్పటివరకు పెళ్లి తేదీ గురించి ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం తెలియజేయలేదు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus