కంగనా రనౌత్ మరియు మహారాష్ట్ర గవర్నమెంట్ మధ్య పెనువివాదం నడుస్తుంది. బాలీవుడ్ లో పాతుకుపోయిన డ్రగ్ మాఫియా గురించి కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేయగా, శివసేన నేతలు తీవ్రంగా ఖండించారు. కంగనా పై వీరు బెదిరింపు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనితో తనకు ప్రాణహాని ఉందని కంగనా కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా ఆమెకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. ఈ భద్రత మధ్య కంగనా ముంబైలో అడుగుపెట్టారు.
ఐతే కంగనాకు ప్రముఖులకు కేటాయించే వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించాడని చాలా మంది తప్పుబట్టారు. ముఖ్యంగా శివసేన నేతలు ఆమెకు కేంద్రం అంత ప్రాధాన్యం ఇవ్వడాన్ని విమర్శించారు. తాజాగా సుప్రీం కోర్ట్ న్యాయవాది బ్రిజేష్ కలప్ప కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లక్షల ఖర్చుతో కంగనా రనౌత్ కి వై ప్లస్ కేటగిరి ఎలా కల్పిస్తారని ఆయన నిలదీశారు. ఒక నెలరోజు పాటు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించడానికి 10లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని,
ప్రజా పన్నులతో సేకరించిన నిధులు ఇలా ఖర్చుపెట్టడం ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. ప్రస్తుతం కంగనా తన హోమ్ టౌన్ మనాలిలో భద్రంగా ఉన్నారు. కాబట్టి ఆమెకు సమకూర్చిన భధ్రత ఉపసంహరించాలని కోరారు. బ్రిజేష్ కలప్ప వ్యాఖ్యలకు కంగనా స్పందించారు. నాకు ముప్పులేద్దని ఇంటలిజెన్స్ బ్యూరో భావిస్తే సెక్యూరిటీ ఉపసంహరిస్తారని, మీరు చెవితే కాదని ఆమె కౌంటర్ వేశారు.
Most Recommended Video
ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!