బ్లాక్ బస్టర్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన లాయర్ల థీమ్..!

టాలీవుడ్లో ఒక్కో ఏడాది ఒక్కో ట్రెండ్ ఎక్కువుగా కొనసాగుతూ ఉంటుంది. ఒక ఏడాది మొత్తం లవ్ స్టోరీలు హిట్ అవుతుంటాయి. మరో ఏడాది మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్లు హిట్ అవుతూ ఉంటాయి. మొన్నామధ్య అయితే వరుసగా పోలీస్ కథలు హిట్ అయ్యాయి. ఇక ఈ ఏడాది అయితే వరుస లాయర్.. అదే వకీల్ సాబ్ ట్రెండ్ ఎక్కువగా వర్కౌట్ అవుతుంది.

8 ఏళ్ళుగా హిట్టు లేకుండా అల్లాడి పోయిన అల్లరి నరేష్ కు ‘నాంది’ రూపంలో మంచి హిట్ దొరికింది. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ లాయర్ గా నటించింది. ఆమె పాత్రే సినిమాకి హైలెట్ అని చెప్పాలి. ప్రత్యర్థులకు చమటలు పట్టించేలా ఆమె వాదించి చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఇక అటు తరువాత ‘జాతి రత్నాలు’ లో హీరోయిన్ ఫరియా లాయర్ గా కనిపించింది. అయితే ఇది సీరియస్ రోల్ కాదు. కామెడీకి ఎక్కువ స్కోప్ ఉన్న రోల్. అయినప్పటికీ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇక తాజాగా పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించిన ‘వకీల్ సాబ్’ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

ఇక గోపీచంద్- మారుతి కాంబినేషన్లో రూపొందుతోన్న ‘పక్కా కమర్షియల్’ మూవీలో కూడా హీరో గోపీచంద్ మరియు రాశీ ఖన్నా లు లాయర్లుగా కనిపిస్తారట. ఇందులో కూడా కామెడీ ఎక్కువగా ఉంటుందట.

అంతా బానే ఉంది కానీ.. నితిన్ హీరోగా నటించిన ‘చెక్’ చిత్రం మాత్రం హిట్టవ్వలేదు. ఇందులో లాయర్ గా నటించిన రకుల్ ప్రీత్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఈ సినిమాలో హీరో కేసు గెలవలేకపోయాడు. ప్రేక్షకులను కూడా అలరించలేకపోయాడు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus