ఎన్టీఆర్ సినిమాకి తప్పని లీకుల గోల!

అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లీకులు ఆగడం లేదు. చిత్ర యూనిట్ సభ్యులు స్పాట్ లోకి ఫోన్లు తీసుకురావద్దని త్రివిక్రమ్ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా లీకుల గోల ఆగడం లేదు. హారిక, హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. తీవ్రగాయాలతో ఉన్న నాగబాబును ఎన్టీఆర్ కారులో తీసుకెళ్తున్న సన్నివేశం టీజర్లో హైలెట్ గా నిలిచింది. ఈ టీజర్ లీక్ నుంచి త్రివిక్రమ్ టీమ్ బయటపడేలోపున మరో లీక్ తలనొప్పి తెచ్చిపెట్టింది.

రైల్వే స్టేషన్ లో పూజా హెగ్డే, ఎన్టీఆర్ లపై ఓ సన్నివేశం తెరకెక్కిస్తుండగా.. ఆ చిత్రికరణను ఎవరో ఫోటోలు తీసి నెట్లో పెట్టారు. చిత్ర యూనిట్ ని కంట్రోల్ చేయగలిగారు కానీ.. అభిమానులను కంట్రోల్ చేయలేకపోయారు. తమ అభిమాన హీరో ఎదురుగా కనిపిస్తే ఎంత రిస్క్ అయినా ఫ్యాన్స్ ఊరుకుంటారా.. చకచకా ఫోటోలు తీసి అప్లోడ్ చేశారు. ఇది ఈరోజు వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్ కి త్రివిక్రమ్ కి మంచి అనుబంధం ఉంది. అతడు సినిమాలో రైల్వే స్టేషన్ లోనే సినిమా మలుపుతిరుగుతుంది. ఇక అత్తారింటికి దారేది సినిమాలో అయితే ఆ స్టేషన్ లోనే క్లైమాక్స్ అదిరిపోయింది. సో ఇందులోనూ రైల్వే స్టేషన్ సీన్ పెట్టారంటే .. ఇక్కడేదో పెద్ద సన్నివేశం జరగనుందని త్రివిక్రమ్, ఎన్టీఆర్ అభిమానులు అంచనాకి వస్తున్నారు. తొలిసారి వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు మామూలుగా లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus