టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం వరుస గా క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్ మోకాలి నొప్పితో బాధ పడుతున్నారని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రభాస్ మందులు, ఇంజెక్షన్లను ఉపయోగించినా అవి పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అందువల్ల ప్రభాస్ సర్జరీ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల షూటింగ్ ను అనుకున్న విధంగా పూర్తి చేసి ప్రభాస్ సర్జరీ చేయించుకోనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
సర్జరీ అనంతరం ప్రభాస్ విశ్రాంతి తీసుకోనున్నారని తెలుస్తోంది. బాహుబలి, బాహుబలి2 సినిమాల్లో నటించిన సమయంలో రోప్ ఫైట్ల వల్ల ప్రభాస్ కు ఈ సమస్య వచ్చిందని సమాచారం అందుతోంది. ప్రభాస్ ఈ మధ్య కాలంలో డ్యాన్స్ ఎక్కువగా ఉన్న సాంగ్స్ కు దూరంగా ఉండటానికి ఇదే కారణమని సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ సినిమా అంటే మినిమం 300 కోట్ల రూపాయల బడ్జెట్ కచ్చితంగా ఉంటుంది.
ఈ సర్జరీతో ప్రభాస్ (Prabhas) మోకాలి నొప్పి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టనున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ తో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇతర భాషల్లో సైతం ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ప్రభాస్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని మరిన్ని సంచలనాలను ప్రభాస్ సొంతం చేసుకుంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ రెమ్యునరేషన్ 100 నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది. ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. ప్రభాస్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ పెరుగుతుండటం గమనార్హం.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!