సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో వరుసగా మరణిస్తున్న సందర్భాలను చూస్తూనే ఉన్నాం. ఒక్క తెలుగులోనే కాకుండా వివిధ భాషలకు చెందిన నటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, దర్శకులు మరణించారు. అంతేకాకుండా హీరోలు, హీరోయిన్లు. కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల కుటుంబాల్లో కూడా విషాదాలు చోటు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ మధ్యనే టాలీవుడ్ సీనియర్ కమెడియన్ కడలి జయసారథి, నందమూరి కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు కంటమనేని ఉమామహేశ్వరి వంటి వారు మరణించారు.
తాజాగా మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన లెజెండరి యాక్టర్ ప్రదీప్ పట్వర్ధన్ హఠాన్మరణం చెందడం అందరికీ షాకిచ్చింది. మంగళవారం నాడు ముంబైలోని తన సొంత నివాసంలో గుండెపోటుతో ప్రదీప్ పట్వర్ధన్ మరణించినట్లు కుటుంబ సభ్యలు తెలిపారు. దీంతో మరాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇతని మృతికి మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ట్విట్టర్లో… ‘తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ప్రదీప్ పట్వార్థన్.
అలాంటి గొప్ప నటుడు హఠాన్మరణం చెందడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. మరాఠి సినీ పరిశ్రమ ఓ లెజెండరి నటుడిని కొల్పోయింది’ అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రదీప్ పట్వర్థన్ ‘ఎక్ ఫుల్ ఛార్ హాఫ్’, ‘డాన్స్ పార్టీ’, ‘మే శివాజీరాజీ భోంస్లే బోల్తె’ వంటి మరాఠి సినిమాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇటీవల ఆయన అనురాగ్ కశ్యప్ ‘బాంబే వెల్వెట్’ క్రైం థ్రిల్లర్ మూవీలో కూడా నటించారు. అంతేకాకుండా కొన్ని మరాఠి టీవీ సీరియల్స్‌లో కూడా ఆయన నటించారు.