Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » K Viswanath Passed Away: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూత!

K Viswanath Passed Away: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూత!

  • February 3, 2023 / 12:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

K Viswanath Passed Away: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూత!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్‌ (కె.విశ్వనాథ్‌) (92) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇబ్బంది ఎక్కువ అవ్వడంతో ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఫిబ్రవరి 19, 1930న గుంటూరు జిల్లా రెపల్లేలో జన్మించిన కె.విశ్వనాథ్‌ తెలుగు చలనచిత్ర సీమలో లెజెండరీ దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా సుపరిచితమే. ఈ క్రమంలో ఆయనకు జాతీయ పురస్కాలు, నంది పురస్కారాలు ఎన్నో దక్కాయి. 1992లో ఉమ్మది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను రఘుపతి వెంకయ్య పురస్కారంతో గౌరవించింది. 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగాను 2017లో దాదాసాహెబ్‌ పురస్కారం కూడా అందుకున్నారాయన.

ఆడియోగ్రాఫర్‌ సినిమాల్లో తన కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన కె.విశ్వనాథ్‌ తన లాంగ్‌ కెరీర్‌లో 53 సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘ఆత్మ గౌరవం’, ‘చెల్లెలి కాపురం’, ‘కాలం మారింది’, ‘శారద’, ‘ఓ సీత కథ’, ‘జీవన జ్యోతి’, ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘సాగరసంగమం’, ‘స్వాతి ముత్యం’, ‘సిరివెన్నెల’, ‘స్వయం కృషి’, ‘స్వర్ణకమలం’, ‘సూత్రధారులు’, ‘శుభసంకల్పం’… ఇలా ఒక్కటేంటి అన్నీ అద్భుతమనే చెప్పాలి. కళలు, సంప్రదాయాల మీద ఆయన సినిమాలు ఎక్కువగా తెరకెక్కేవి. మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాలు దూసుకుపోతున్న సమయంలోనే ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ రాణించారు. ఆయన సినిమాలు కొన్ని రష్యన్‌ భాషలోకి డబ్బింగ్‌ చేశారు కూడా. వాటిని మాస్కోలోని థియేటర్లలో విడుదల చేశారు.

కె.విశ్వనాథ్‌ తన కెరీర్‌లో తొమ్మిది బాలీవుడ్‌ సినిమాలను కూడా తెరకెక్కించారు. వాటితోపాటు టీవీ సీరియళ్లలోనూ నటించారు. దర్శకుడిగా ఆయన ఆఖరి సినిమా ‘శుభప్రదం’. ఈ సినిమాలో 2010లో వచ్చింది. నటుడిగా అయితే 2016లో వచ్చిన ‘హైపర్‌’లో ఆఖరిగా తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. గతేడాది ‘ఒప్పండ’ అనే కన్నడ సినిమాలో నటించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #K Vishwanath

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

2 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

3 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

18 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

2 hours ago
Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

4 hours ago
KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

5 hours ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version