అలనాటి…’దర్శక’ దిగ్గజాలు!!!

  • December 15, 2016 / 03:23 AM IST

ఇప్పటి టాలీవుడ్ లో హీరోల డేట్స్ కోసం వెనుకబడి మరీ కోట్లు గుమ్మరించి కాంబినేషన్స్ ను పట్టుకుంటున్నారు మన నిర్మాతలు. అదే క్రమంలో హీరోలను మైండ్ లో పెట్టుకుని కధలను తయారుచేస్తున్నారు మన దర్శకులు. ఇక ఒక హీరోకు, మరో హీరోకు మధ్య పోటీతత్వం భాగా పెరిగిపోతూ వస్తుంది. ఇదంతా ఇప్పటి ట్రెండ్ కానీ, ఒకప్పుడు ఇలా కాదు, దాదాపుగా 1980వ దశకంలో కధలే ఆధారంగా సినిమాలు తెరకెక్కించేవారు, హీరో హీరోయిన్స్ తో సంభంధం లేకుండా, కాంబినేషన్స్ అనే తలనొప్పి లేకుండా తమ ఆలోచనలని తెరకెక్కించే ప్రయత్నంలో ఎన్ని కళాఖండాలు మన తెలుగు తెరకు పరిచయం చేశారు మన దర్శక దిగ్గజాలు. మరి ఆనాడు ఆణిముత్యాలను మనకందించిన దర్శక ధీరులపై ఒక లుక్ వేద్దాం రండి…..

‘కళా’తపస్వి విశ్వనాధ్కళను ఆధరించి, కళను ప్రేమించే వ్యక్తులలో విశ్వనాధ్ ఒకరు. ఆయన తీసిన సినిమాల్లో…సాగరసంగమం’ శాస్తీయ నృత్యం యొక్క గొప్పదనాన్ని తెలియజేయగా, ‘స్వాతిముత్యం’ సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. ‘స్వయంకృషి’ సినిమా చిరు కరియర్ లోనే సరికొత్త సినిమాగా ఆవిష్కృతం అవగా, ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే నానుడికి సరికొత్త అర్ధాన్ని ఇచ్చింది. ఇక శంకారభరణం సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త చరిత్రకు ఒక మైలు రాయిగా నిలిచిపోయింది.

బాపు – రమణసత్తిరాజు లక్ష్మి నారాయణ…ముద్దుగా బాపు అని పిలుచుకునే మన దర్శక దిగ్గజం, తన స్నేహితుడు రమణతో కలసి చేసిన సినీ ప్రయాణం తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఒక ప్రఖ్యాత కార్టూనిస్ట్ గా బాపు మంచి ఖ్యాతిని గడించారు. ఆయనలోని కళాత్మక భావం తాను తెరకెక్కించిన సినిమాల్లో ప్రతీ షాట్ లో కనిపిస్తుంది. ఆయన కలంలోనుంచి జాలువారిన అందాల సోయగాలు బాపు బొమ్మగా ఇప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.

దర్శకరత్న….దాసరి

ఆర్ నారాయణ మూర్తి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వంటి తెలుగు హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత మన దర్శక రత్న దాసరికే దక్కుతుంది. దాదాపుగా 9నంది అవార్డ్స్, 2న్యాషనల్ అవార్డ్స్ దక్కించుకున్న దర్శకుడిగా మన దాసరి మంచి ఖ్యాతినిఘడించారు. నక్సలిజం, కొమ్యునిజం, బడుగువర్గాల హక్కుల పోరాటాల కధలపై దాసరి సంధించిన అస్త్రాలు అప్పట్లో సంచలనాలకు కేంద్రబిందువుగా మారాయి.

దర్శకేంద్రుడు….రాఘవేంద్రరావుకమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ రాఘవేంద్ర రావు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే పెద్ద హీరోలతో మన దర్శకేంద్రుడు సంధించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల వర్షాన్ని కురిపించాయి. ఆయన పాటల చిత్రీకరణలో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టడమే కాకుండా, పాటల్లో అందాల భామల అందాన్ని మరింత అందంగా చూపించి తన పాటలకు తానే కొరియోగ్రఫీ చేసుకున్న ఘానత సైతం సంపాదించారు. ఆయన సాధించిన హిట్స్ లో అడివి రాముడు, అన్నమయ్య, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇలా భారీ హిట్స్ ఉన్నాయి.

‘జంధ్యాల’ సుభ్రమణ్యశాస్త్రిరచయితగా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన జంధ్యాల అతి కొద్ది కాలంలోనే ప్రముఖ దర్శకుడిగా మారిపోయాడు. శంకారాభరణం, సాగర సంగమం, ఆదిత్య 369, గోవింద గోవింద లాంటి సినిమాలకు రచయితగా పనిచేసిన ఆయన, రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి వాళ్ళను హీరోలుగా నిలిపి భారీ హిట్స్ కొట్టారు. కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం లాంటి వాళ్ళకు స్టార్ డమ్ రావడంలో మన జంధ్యాల గారి సినిమాలు ఎంతో తోడ్పడ్డాయి. ఇక ప్రస్తుత తరంలో త్రివిక్రమ్ లాంటి దర్శకులపై మన జంధ్యాల గారి ప్రభావం చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఇక ఆయన దర్శకత్వంలో అహానాపెళ్ళంట, ఆనంద భైరవి, పడమటి సంధ్యా రాగం వంటి సినిమాలు భారీ హిట్స్ గా నిలిచాయి.

కోదండరామిరెడ్డిసుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవిని, మెగాస్టార్ గా మార్చడంలో కొండందరామిరెడ్డి పాత్ర కీలకం అని చెప్పాలి. దాదాపుగా వరుస హిట్స్ తో చిరుకి స్టార్ డమ్ తెచ్చిపెట్టారు మన రెడ్డిగారు. ఖైదీ, అభిలాష, చ్యాలెంజ్, దొంగ, విజేత, భారీ హిట్స్ సాధించి చిరుని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఇక బాలయ్యతో నారి…నారి నడుమ మురారి, నాగార్జున తో వికీ దాదా, అల్లరి అల్లుడు, వెంకీ తో, సూర్య ఐపీయెస్, ధర్మక్షేత్రం ఇలా భారీ హిట్స్ ను అందించారు.

‘వంశీ’గోదావరి జిల్లాల అందాలను, ఆ ప్రాంతంలోని ప్రేమాభిమానాలు, పద్దతులు, అన్నీ వంశీ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ల్యాడీస్ టేలర్ సినిమా మంచి హిట్ కొట్టగా, దాదాపుగా 1980-1990వరకూ మంచి హిట్స్ తో దూసుకుపోయాడు వంశీ. తొలిరోజుల్లో ప్రఖ్యాత దర్శకుడు కే. విశ్వనాధ్ వద్ద రైటర్ గా పనిచేసిన వంశీ, భాను ప్రియ హీరోయిన్ గా సితార అనే సినిమాను తెరకెక్కించడమే కాకుండా ఆ సినిమా సమయంలో ఆమెతో ప్రేమలో కూడా మునిగి తేలాడు. సినిమా అయితే భారీ హిట్ అయ్యింది కానీ, పాపం ఆమె మనసు మాత్రం గెలుచుకోలేక పోయాడు మన దర్శకుడు.

ఈ.వీ.వీ సత్యనారాయణప్రఖ్యాత దర్శకుడు జంధ్యాల గారి శిష్యుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన మన ఈవీవీ, ఎన్నో భారీ హిట్స్ ను పరిశ్రమకు అందించారు. అందులో హెల్లొ బ్రదర్, సూర్య వంశం, ఆవిడే మా ఆవిడ లాంటి సరికొత్త సినిమాలు తీశారు. అంతేకాకుండా ఆమె, తాళి వంటి సినిమాలు సైతం ఈ.వీవీ తెరకెక్కించనవే. ఎక్కువగా జంధ్యాల గారి కామెడీ, డైలాగ్స్ ఈయన సినిమాలో కనిపిస్తాయి.

ఇలా మన తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేశారు మన దర్శక దిగ్గజాలు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus