Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 10, 2026 / 01:16 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అఖిల్ అక్కినేని (Hero)
  • భాగ్య‌శ్రీ బోర్సె (Heroine)
  • సునీల్, శివాజీ, బ్రహ్మాజీ తదితరులు (Cast)
  • ముర‌ళి కిషోర్ అబ్బూరు (Director)
  • అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ (Producer)
  • త‌మ‌న్‌.ఎస్‌ (Music)
  • లియోన్ బ్రిట్టో (Cinematography)
  • న‌వీన్ నూలి (Editor)
  • Release Date : 10th జూలై 2026
  • మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ (Banner)

హీరోగా ఇప్ప‌టివ‌ర‌కు మోడ్ర‌న్ క‌థ‌ల‌తోనే సినిమాలు చేశాడు అఖిల్ అక్కినేని (Akhil). ఫ‌స్ట్ టైమ్ లెనిన్ మూవీతో రూర‌ల్ జాన‌ర్‌ను ట‌చ్ చేశాడు. యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు ముర‌ళీకృష్ణ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో క‌లిసి హీరో నాగార్జున నిర్మించిన ఈ సినిమాలో భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టించింది. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన లెనిన్ ఎలా ఉంది? ఈ సినిమాతో అఖిల్‌కు హిట్టు ద‌క్కిందా? లేదా అంటే?

Lenin Movie Review

Lenin Movie Review and Rating

క‌థ‌: శ్రీరామపురంలో భార‌తం మిట్ట జాత‌ర‌ను ప‌ద్దెనిమిది రోజుల పాటు జ‌రుపుతుంటారు. ఆ జాత‌ర జ‌రిగే ప్రాంతంలో ఒక్క ర‌క్త‌పు బొట్టు నేల రాల‌కూడ‌ద‌న్న‌ది ఆచారం. ఆ జాత‌ర‌ను చాలా ఏళ్లుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వ‌హిస్తుంటాడు లెనిన్ (అఖిల్ అక్కినేని). అనాథ అయిన లెనిన్‌ను ఊరి పెద్ద జ‌యంతి (ఈశ్వ‌రీరావు) సొంత కొడుకులా చేర‌దీస్తుంది. ఆ జాత‌ర‌లోనే లెనిన్‌కు భార‌తితో (భాగ్య‌శ్రీ బోర్సే) ఏర్ప‌డిన‌ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. ఇద్ద‌రూ పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటారు.

కానీ పెద్ద‌లు మాత్రం జ‌యంతి కొడుకు వ‌సంత్‌తో (ప్ర‌మోద్ పంజు) భార‌తి పెళ్లిని నిశ్చ‌యిస్తారు. ఆ త‌ర్వాత ఏమైంది? ఆప్తుడిగా న‌మ్మిన స్నేహితుడు వ‌సంత్ ….లెనిన్‌కు ఎలాంటి ద్రోహం త‌ల‌పెట్టాడు? జాత‌ర‌లో ఎవ‌రిని హ‌త్య చేసి లెనిన్ జైలు పాల‌య్యాడు? వసంత్ కుటుంబంపై య‌తిరాజు (శివాజీ) ప‌గ‌తో ర‌గిలిపోవ‌డానికి కార‌ణ‌మేమిటి? లెనిన్ కార‌ణంగా ఎమ్మెల్యే రాఘ‌వ‌రెడ్డి, దామోద‌ర కు(బ్ర‌హ్మాజీ) ఎలాంటి అవ‌మానాలు ఎదుర‌య్యాయి? లెనిన్‌ను ప్రాణంగా ప్రేమించిన భార‌త అత‌డికి ఎలా దూర‌మైంది? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Lenin Movie Review and Rating

న‌టీన‌టుల ప‌నితీరు: గ‌త సినిమాల‌తో పోలిస్తే అఖిల్ (Akhil) న‌ట‌న‌లో మెచ్యూరిటీ క‌నిపించింది. కామెడీ టైమింగ్‌, డైలాగ్ డెలివ‌రీ మెరుగ‌య్యాయి. ఎమోష‌న‌ల్ సీన్ల‌లో ఆక‌ట్టుకున్నాడు. అఖిల్ సంభాష‌ణ‌లు చెప్పిన తీరు కొన్ని చోట్ల నాగార్జున‌ను గుర్తుకుతెచ్చింది. న‌టుడిగా అఖిల్‌ను ఈ సినిమా మ‌రో మెట్టు ఎక్కించింది. భాగ్య‌శ్రీ బోర్సే నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించింది. డామినేష‌న్ నేచ‌ర్ క‌లిగిన అమ్మాయిగా ఆక‌ట్టుకుంది. అఖిల్‌తో ఆమె కెమిస్ట్రీ బాగుంది. మంచివాడిగా క‌నిపించే విల‌న్ పాత్ర‌లో ప్ర‌మోద్ పంజు చ‌క్క‌టి వేరియేష‌న్స్ చూపించాడు. విల‌నిజం పండించే సీన్ల‌లో అద‌ర‌గొట్టాడు. సెకండ్ ఇన్నింగ్‌లో శివాజీ చేసిన మంచి సినిమాల్లో లెనిన్ ఒక‌టిగా నిలుస్తుంది. పాజిటివ్‌గా క‌నిపించే నెగెటివ్ క్యారెక్ట‌ర్‌లో అద‌ర‌గొట్టాడు.

హీరోకు ఎలివేష‌న్లు ఇవ్వ‌డానికి సునీల్ పాత్ర‌ను డైరెక్ట‌ర్ వాడుకున్నాడు. ఈశ్వ‌రీరావు న‌ట‌న ఓకే. బ్ర‌హ్మాజీకి ఇలాంటి పాత్ర‌లు కొత్త కాదు. గెట‌ప్ శీను, ప్ర‌వీణ్‌తో పాటు సినిమాలో చాలా మందే క‌మెడియ‌న్లు ఉన్నారు. ప‌రిధుల మేర ఆక‌ట్టుకున్నారు.

Lenin Movie Review and Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: మ‌హాభార‌తాన్ని రిఫ‌రెన్స్‌గా తీసుకొని రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో లెనిన్ క‌థ‌ను రాసుకున్నాడు డైరెక్ట‌ర్ ముర‌ళీకృష్ణ అబ్బూరు. ఈ క‌థ‌ను క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో చెప్ప‌డంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు. త‌మ‌న్ మ్యూజిక్ బాగుంది. వారేవా సాంగ్ తో పాటు యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లో బీజీఎమ్ గూస్‌బంప్స్ ఫీలింగ్‌ను క‌లిగిస్తుంది.

లియాన్ బ్రిట్టో సినిమాటోగ్ర‌ఫీ క‌ల‌ర్‌ఫుల్‌గా సాగింది. జాత‌ర ఎపిసోడ్స్‌ను నాచుర‌ల్‌గా చూపించారు. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో క‌లిసి హీరో నాగార్జున ఈ సినిమాను నిర్మించారు. క‌థ‌కు ఎంత అవ‌స‌ర‌మో అంతే బ‌డ్జెట్ పెట్టారు. వేస్టేజ్ అన్న‌ది ఎక్క‌డ క‌నిపించ‌లేదు.

Lenin Movie Review and Rating

విశ్లేష‌ణ‌: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మైథాల‌జీ సినిమాలు బాక్సాఫీస్ స‌క్సెస్ ఫార్ములాగా మారిపోయాయి. పుష్ప‌, పుష్ప 2 బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌తో చిత్తూరు యాస, భాష‌ల‌తో క‌థ‌లు చెప్పేందుకు ద‌ర్శ‌కులు ఆస‌క్తిని చూపుతున్నారు. ఈ రెండు ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ వ‌చ్చిన సినిమానే లెనిన్. మ‌హాభార‌తం క‌థ ధ‌ర్మానికి ప్ర‌తీక‌. అంతే కాదు అందులో ఎన్నో కుట్ర‌లు, కుతంత్రాలు, వెన్నుపోట్లు కూడా ఉంటాయి. వాట‌న్నింటిని లెనిన్ క‌థ ద్వారా నేటి త‌రానికి అర్థ‌మ‌య్యేలా ఓ ప్రేమ‌క‌థ ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు ముర‌ళీకృష్ణ అబ్బూరు. అడుగ‌డుగునా ఈ సినిమాలో మ‌హాభార‌తం రిఫ‌రెన్స్‌లు క‌నిపిస్తూనే ఉంటాయి. త‌న ఆప్తులు బంధువుల‌తోనే యుద్ధం చేయాల్సివ‌చ్చిన‌ప్పుడు పాండ‌వులు ఎదుర్కొన్న సంఘ‌ర్ష‌ణ‌ను హీరో పాత్ర ద్వారా అర్థ‌వంతంగా సినిమాలో చూపించారు.

మ‌హాభార‌తంలో జూదంలో పాండ‌వులు ఓడిన త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ది చెబుతూ జూనియ‌ర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌తో లెనిన్ ఇంట్రెస్టింగ్‌గా మొద‌ల‌వుతుంది. ఈ ఇతిహాసానికి భార‌తం మిట్ట జాత‌ర‌ను లింక్ చేస్తూ ద‌ర్శ‌కుడు క‌థ‌లోకి వెళ్లిన తీరు భ‌లేగా అనిపిస్తుంది. అక్క‌డి నుంచి హీరోహీరోయిన్ల పాత్ర‌ల ప‌రిచ‌యం, వారి ప్రేమ‌క‌థ‌తో ఫ‌స్ట్ హాఫ్ ఆహ్లాదంగా సాగిపోతుంది. మాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునేలా ల‌వ్‌స్టోరీని న‌డిపించారు. ఎమ్మెల్యే, బ్ర‌హ్మాజీ పాత్ర‌ల‌తో పాటు ఈశ్వ‌రీరావు విల‌న్ అన్న‌ట్లుగా చూపించి స‌స్పెన్స్‌మెయింటేన్ చేశారు.

సెకండాఫ్ కంప్లీట్ ఎమోష‌న‌ల్‌గా సాగుతుంది. అస‌లు విల‌న్ ఎవ‌ర‌న్న‌ది రివీల‌య్యే ఎపిసోడ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో కాస్తంత ర‌క్త‌పాతం ఎక్కువే అయ్యింది. అక్క‌డ వ‌చ్చే ట్విస్ట్ కూడా బాగుంది. చిత్తూరు యాస, భాష‌లు ఈ సినిమాకు ప్ల‌స్స‌య్యాయి. బ‌స్ యాక్ష‌న్ ఎపిసోడ్‌, హీరోహీరోయిన్ల పెళ్లి టైమ్‌లో వ‌చ్చే ఫైట్ సీన్లు బాగున్నాయి. జాత‌ర సీన్ పుష్ప‌ను గుర్తుకుతెస్తుంది. రూర‌ల్ ల‌వ్‌స్టోరీతో తెలుగులో సినిమా వ‌చ్చి చాలా కాల‌మైంది. ఆ లోటును లెనిన్ భ‌ర్తీ చేసింది.

Lenin Movie Review and Rating

ఫోక‌స్ పాయింట్: స్ట్రాంగ్‌ ఎలివేష‌న్లు, ఎమోష‌న్స్‌తో సాగే ప‌ర్‌ఫెక్ట్‌ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. మాస్ ఆడియెన్స్ మంచి విందుభోజ‌నం లాంటి సినిమా.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Bhagyashri Borse
  • #Brahmaji
  • #Easwari Rao
  • #Getup Srinu

Reviews

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

14 mins ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

8 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

10 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

3 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

4 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

5 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version