కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘లియో’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19 న దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే లోకేష్ గత చిత్రం ‘విక్రమ్’ ఇక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో ‘లియో’ కి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో నమోదయ్యాయి. రిలీజ్ అయ్యి 8 రోజులు కావస్తున్నా ఈ మూవీ కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి.
ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ‘లియో’ 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 9.36 cr |
సీడెడ్ | 4.12 cr |
ఉత్తరాంధ్ర | 2.71 cr |
ఈస్ట్ | 1.80 cr |
వెస్ట్ | 1.05 cr |
గుంటూరు | 1.66 cr |
కృష్ణా | 1.48 cr |
నెల్లూరు | 0.97 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 23.15 cr |
‘లియో’ (LEO) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.15.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.16 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.23.15 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ చిత్రం రూ.7.15 కోట్ల లాభాలను అందించింది. రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ క్యాష్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!