దసరా కానుకగా తెలుగులో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’, మరొకటి రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ రెండు సినిమాలతో పాటు విజయ్ నటించిన ‘లియో’ అనే డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. తమిళంలో ‘విక్రమ్’ వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వంటి బడా బ్యానర్ పై నాగవంశీ రిలీజ్ చేస్తుండడంతో..
ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. ట్రైలర్ బాగానే ఉంది. పాటలపై కూడా పాజిటివ్ కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ రిపోర్ట్ ప్రకారం.. లియో మూవీ 2 గంటల 44 నిమిషాల నిడివి కలిగి ఉంది అని తెలుస్తుంది. ఈ చిత్రానికి కొన్ని కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది చిత్ర బృందం.
ట్రైలర్లో వినిపించిన బూతు పదాన్ని మ్యూట్ చేసారని సమాచారం. ఇక ఈ చిత్రం (LEO Movie) ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో సాగుతుందట. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. యాక్షన్ ఎపిసోడ్స్.. బాగా వచ్చాయట. అలాగే విక్రమ్, ఖైదీలకి లింక్ ఉన్నట్టు కూడా హింట్ ఇచ్చాడట దర్శకుడు. ముఖ్యంగా లాస్ట్ సీన్ అలా ఉంటుందట. విజయ్ – త్రిష చాలా కాలం తర్వాత కలిసి నటించినా.. పెయిర్ ఆకట్టుకునే విధంగా ఉందని తెలుస్తుంది.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు