విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది. 60 సంవత్సరాల వయస్సులో ఖైదీ, లియో సినిమాలలో నెపోలియన్ పాత్రలో కనిపించిన నటుడు హాట్ టాపిక్ అయ్యారు. ఓవర్ నైట్ లో స్టార్ అయిన ఈ నటుడి బ్యాగ్రౌండ్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
నెపోలియన్ పాత్రలో కనిపించిన ఈ నటుడి పేరు జార్జ్ మరియన్ కాగా చెన్నైలో పుట్టిన జార్జ్ మరియన్ థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు. 13 సంవత్సరాల పాటు జార్జ్ మరియన్ థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగించారు. ఆళగి అనే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలో జార్జ్ మరియన్ కెరీర్ మొదలైంది. కామెడీ పాత్రలలో ఈ నటుడు సినిమాలలో ఎక్కువగా నటించడం గమనార్హం.
70కు పైగా సినిమాలలో నటించిన ఈ నటుడు కార్తీ ఖైదీ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు. లియో సినిమాలో సైతం నెపోలియన్ పాత్రలో కనిపించి ఈ నటుడు ప్రేక్షకులను మెప్పించారు. వాస్తవానికి విక్రమ్ సినిమాలో కూడా ఈ పాత్ర ఉందని అయితే నిడివి సమస్య వల్ల సీన్లను తీసేశామని లోకేశ్ కనగరాజ్ వెల్లడించారు. లోకేశ్ కనగరాజ్ తర్వాత సినిమాల్లో సైతం ఈ నటుడు కనిపించనున్నారని సమాచారం.
లోకేశ్ కనగరాజ్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉంది. లోకేశ్ తర్వాత మూవీ రజనీకాంత్ హీరోగా తెరకెక్కనుంది. జైలర్ తర్వాత రజనీ నటిస్తున్న సినిమా ఇదే కాగా రజనీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. రజనీకాంత్ తర్వాత సినిమాలతో సైతం సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. లోకేశ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో (George Maryan) జార్జ్ మరియన్ కు ఎలాంటి రోల్స్ ఇస్తారో చూడాల్సి ఉంది.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!