Life Of Muthu: శింబు కొత్త సినిమా ఓటీటీ డేట్‌ ఫిక్స్‌.. కానీ?

  • October 13, 2022 / 12:05 PM IST

శింబు – గౌతమ్‌ మేనన్‌ కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన చిత్రం ‘వెందు తనిందతు కాడు’. తెలుగోల ‘ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’. పోస్టర్లు, వీడియోలతో కాస్త హైప్‌ వచ్చినా.. విడుదలకు ముందు సినిమాను లో ప్రొఫైల్‌లో ఉంచారు. రెండు భాగాలుగా ప్రారంభించిన ఈ సినిమా తొలి పార్ట్‌ సెప్టెంబరు 15న విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. అక్టోబరు 13 నుండి ‘వెందు తనిందతు కాడు’ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవ్వనుంది.

ఈ మేరకు సినిమా టీమ్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించారు. అయితే తెలుగు వెర్షన్‌ వస్తుందా? కేవలం తమిళ వెర్షన్‌ మాత్రమే రిలీజ్‌ అవుతుందా అనేది తెలియడం లేదు. పోస్టర్‌ ప్రకారం చూస్తే.. తమిళ వెర్షన్‌ మాత్రే వస్తోంది అని అర్థమవుతోంది. దీంతో తెలుగు వెర్షన్‌ అంటే ‘ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’ వేరే ఓటీటీకి ఇచ్చారా అనేది తెలియాలి. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. సిద్ధి ఇద్నాని కథానాయికగా మెరిసిన ఈ చిత్రంలో రాధిక కీలక పాత్రలో నటించారు.

ఏ దిక్కూ లేని ఓ వ్యక్తి జీవితంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, వాటిని అధిగమించి ఉన్నత స్థాయికి ఎలా ఎదిగాడు, అనే కథాంశంతో సినిమా రూపొందింది. ఈ సినిమా రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందితే.. రూ. 50 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది తమిళ పరిశ్రమలో ఇదొక మంచి విజయం అని చెప్పొచ్చు. పృథ్వీరాజ్‌ సుకుమార్‌ సినిమా ‘కడువా’ విషయంలోనూ ఇలానే జరిగింది.

మలయాళ వెర్షన్‌తోపాటే తెలుగు వెర్షన్‌ కూడా రిలీజ్‌ చేస్తారు అని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో సినిమా తెలుగు వెర్షన్‌ను అప్పుడు అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతోనే ‘ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’ సినిమా తెలుగు వెర్షన్‌ కోసం చర్చలు మొదలయ్యాయి. తమిళంతోపాటే తెలుగు వస్తే హ్యాపీ.. లేదంటే వేరే ఓటీటీ ఏదన్నా ఉంటే అదైనా చెప్పాల్సింది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus