Liger Movie: మోస్ట్‌ వాంటెడ్‌ క్వశ్చన్స్‌ మీ ప్రశ్న కూడా ఉందా?

‘లైగర్‌’.. విజయ్‌ దేవరకొండ – పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది. అనన్య పాండే కథానాయికగా నటించిన ఈ సినిమాను కరణ్‌ జోహార్‌, ఛార్మి నిర్మించారు. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయ్‌, పూరి జగన్నాథ్‌ను ఛార్మి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. అందులో ఛార్మి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగింది. సగటు అభిమాని ప్రశ్నలు ఇవీ అని కూడా చెప్పింది. ఇప్పుడు దానికి సమాధానాలొచ్చాయి.

* ‘లైగర్‌’ సినిమా టీమ్‌ నుండి ఇంకో ట్రైలర్‌ వస్తుందా? ఇప్పుడొచ్చిన ట్రైలర్‌లో కథ తెలియడం లేదు?

– పూరి జగన్నాథ్‌: సినిమాకు మరో ట్రైలర్‌ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ట్రైలర్‌ కొత్తగా ఎడిట్‌ చేశాం. చాలా మంది నా సినిమా నుండి ఎక్కువ డైలాగ్‌లు ఆశించారు. ఇందులో హీరో పాత్రకు నత్తి. అలాంటప్పుడు ఎక్కువ డైలాగ్‌లు పెడితే బాగుండదు. అందుకే తక్కువ డైలాగ్‌లతోనే ఉంటుంది. ట్రైలర్‌ కట్‌ కూడా దానికి తగ్గట్టుగానే చేశాం. సినిమా కథ చూస్తే.. ఒక కరీంనగర్‌ కుర్రాడు, వాళ్ల అమ్మ కలసి ముంబయి వెళ్లి ఏం చేశారు? తన కొడుకును ఎంఎంఏ ఛాంపియన్‌గా చూడటానికి ఓ తల్లి ఏం చేసింది? తల్లి కల కోసం ఆ కుర్రాడు ఎంత కష్టపడ్డాడు? అన్నది సినిమాలో చూడొచ్చు..!

* మైక్‌ టైసన్‌ పాత్రను చాలా బ్రూటల్‌గా ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం? కానీ ట్రైలర్‌లో చాలా సరదాగా చూపించారు?

పూరి జగన్నాథ్‌: సినిమా మీద అనవసరంగా ఏవేవో అంచనాలు పెట్టుకోవద్దు. టైసన్‌కు కొత్త లుక్‌ ఇచ్చాం. క్లైమాక్స్‌లో అతను వస్తాడు. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ ఇలా రాలేదు. ‘పుష్ప’ క్లైమాక్స్‌లో హీరో – విలన్‌ కూర్చొని మాట్లాడుకుంటారు. అది చాలా కొత్తగా అనిపించింది. ‘లైగర్‌’లోనూ అలాంటి కొత్త సిట్యువేషన్‌ను ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు.

* విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. నీ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను నువ్వే హ్యాండిల్‌ చేస్తావా?

విజయ్‌ దేవరకొండ: నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలా ఉన్నాను అంటే.. దానికి అభిమానులే కారణం. అలా నన్ను ప్రేమిస్తున్న వాళ్లకు ఎప్పుడూ టచ్‌లో ఉండాలి అనుకున్నాను. అందుకే సోషల్‌ మీడియాను ఎంచుకున్నాను. అయితే నేను సోషల్‌ మీడియా యాప్స్‌ వాడను. నా ఫ్రెండ్స్‌, టీమ్‌ నాకు ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ పంపే విషయాలు, కామెంట్స్‌, పోస్ట్‌లు పంపిస్తారు. అప్పుడు వాటిపై నేను కచ్చితంగా స్పందిస్తాను.

* పూరి జగన్నాథ్‌తో విజయ్‌ దేవరకొండ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు. కారణమేంటి?

విజయ్‌ దేవరకొండ: కెరీర్‌ ప్రారంభించే సమయంలో నేను ఏదైనా గొప్ప సినిమా చేయాలి. అది మామూలుగా ఉండకూడదు అని అనుకున్నా. పూరి జగన్నాథ్‌తో కలిశాక, ఆయన కథలు విన్నాక నేను అనుకున్నది పూరితోనే సాధ్యమవుతుంది అనిపించింది. అందుకే వెంటవెంటనే కలసి పని చేస్తున్నాను.

* సినిమా బడ్జెట్‌ పెరిగింది? సినిమా మీద కాన్ఫిడెన్స్‌ చాలా ఎక్కువ ఉంది అని మిమ్మల్ని చూస్తే అర్థమవుతోంది. అసలు ఎలాంటి వసూళ్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? పొరపాటున సినిమా బాగోలేదు? జనాలు థియేటర్లకు రాలేదు? అంటే ఏం చేస్తారు?

విజయ్‌ దేవరకొండ: నాకు సినిమాలు దొరకడం కష్టంగా ఉన్నప్పుడు ‘నీ ధర్మం నువ్వు చెయ్‌.. ప్రకృతి చూసుకుంటుంది’ అని ఒకరు చెప్పారు. దాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. ఈ సినిమా కంటెంట్‌ బలంగా ఉంది. నా శక్తికి మించి ఈ సినిమా కోసం చేశా. బడ్జెట్‌ విషయంలోనూ ఎవరూ కాంప్రమైజ్‌ కాలేదు. అది చూసి నేను ఇంకా చాలా ఉత్సాహంగా నటించాను. ‘లైగర్‌’ రిలీజ్‌ సమయానికి కరోనా లేకుండా, జనాలు ఆస్పత్రి పాలవకుండా, థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీ ఇస్తే, థియేటర్లను మేం నింపుతాం..!’ అని దేవుడిని మొక్కుకున్నా.. ఇప్పుడు అదే జరగబోతోంది.

* లాక్‌ డౌన్‌ టైమ్‌లో ఈ సినిమా అమ్మేయమంటూ ఓ ఆఫర్‌ వచ్చింది? ఆ టైమ్‌లో నిర్మాతల దగ్గర రూపాయి కూడా లేదు. అలాంటి సమయంలో ఆ భారీ ఆఫర్‌ను ఎందుకు వద్దనుకున్నారు?

ఛార్మి: కొవిడ్‌ పరిస్థితులు, వరుస లాక్‌డౌన్‌లతో ఫైనాన్సియల్‌గా ఇబ్బందులు పడ్డాం. ఓటీటీకి ఇచ్చేయండి అంటూ ఓ భారీ ఆఫర్‌ వచ్చింది. ఆ టైమ్‌లో జేబులో ఒక్క రూపాయి లేదు. అంత భారీ ఆఫర్‌ రిజెక్ట్‌ చేయడానికి దమ్ము కావాలి. ఆ దమ్మున్న వ్యక్తి పూరి జగన్నాథ్‌. ఆ సమయంలో మాకు గుర్తొచ్చింది రెండే విషయాలు. ఒకటి విజయ్‌ దేవరకొండ, రెండోది కథ. వాటి మీద నమ్మకంతోనే థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్నాం. ఆగస్టు 25న థియేటర్లలో సంచలనం సృష్టిస్తాం.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus