Liger Movie: ‘క్రాస్‌ బ్రీడ్‌’లో ఏమేం తీసేశారంటే..?

పూరి జగన్నాథ్‌ సినిమాలో యూత్‌ కోసం కొన్ని స్పెషల్‌ సీన్స్‌, స్పెషల్‌ డైలాగ్స్‌ ఉంటాయి. వీటితోపాటు యూత్‌ ఫుల్‌ నెస్‌ పేరుతో కాస్త ఇంగ్లిష్‌ తిట్లు కూడా పెడుతూ ఉంటారు. గతంలో వచ్చిన పూరి సినిమాల్లో ఇలాంటి మిక్స్‌ డైలాగ్‌లు మనం చాలానే చూశాం. అయితే ‘లైగర్‌’ సినిమాలో కూడా ఇలాంటి కొన్ని డైలాగ్స్‌, సీన్స్‌, మాటలు ఉన్నాయి. అయితే సెన్సార్‌ దగ్గర కొన్ని డైలాగ్స్‌ను తీసేయమన్నారట. దీంతో టీమ్‌ వాళ్లు చెప్పిన మార్పులు చేసి సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందింది.

సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ సర్టిఫికెట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 17వ తేదీ ఈ సెన్సార్‌ పూర్తయిందని ఆ ఇమేజ్‌ ద్వారా తెలుస్తోంది. సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు. సినిమా నిడివి రెండు గంటల 20 నిమిషాలుగా ఉంది. పూరి సినిమాలతో పోలిస్తే ఇది నార్మల్‌. ఇక సెన్సార్‌ టీమ్‌ ఈ సినిమాకు ఏడు మార్పులు సూచించారు. అందులో కొన్ని మ్యూట్‌ చేయాల్సి ఉండగా, మరికొన్నింటిని మార్చాల్సి వచ్చింది. అయితే ఎలాంటి నిడివి తగ్గలేదు.

సెన్సార్‌ సర్టిఫికెట్‌ ప్రకారం చూస్తే.. సినిమాలో ఓ బ్రిటిష్‌ నోవలిస్ట్‌ డైలాగ్‌ను వాడుకున్నారు. దానికి హిందీలో యాడ్‌ చేశారు. టైటిల్‌ కార్టును కూడా యాడ్‌ చేశారు. ఇవి యాడ్‌ చేసిన విషయాలైతే.. రెండు పదాలను మ్యూట్‌ చేశారు. 48వ నిమిషం దగ్గర ‘సైకిల్‌ తోకో’ అనే పదాన్ని మ్యూట్‌ చేశారు. ఆ తర్వాత ఆరు సార్లు ‘ఫ**’ అనే పదాన్ని మ్యూట్‌ చేశారు. దీంతోపాటు కుతియా అనే పదాన్ని గంట మూడో నిమిషం దగ్గర మ్యూట్‌ చేశారు. ‘కే లవ్‌..’ అనే మాటను గంట 41వ నిమిషం దగ్గర మ్యూట్‌ చేశారు.

25వ నిమిషం, గంట 41వ నిమిషం, గంట 56వ నిమిషం, 2 గంటల 5వ నిమిషం, 2 గంటల 10వ నిమిషం, 2 గంటల 12వ నిమిషం దగ్గర ‘ఫ**’ అనే పదం మ్యూట్‌ చేశారు. ఇవి కాకుండా ‘వో తేరీ చాతతా హై..’ అంటూ సాగే డైలాగ్‌ను ‘లెజెండ్‌ తేరా చెంచా..’ అనే డైలాగ్‌తో మార్చారు. ఇక ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus