విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ ఫుల్ రన్ ముగిసింది. ఆగస్టు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఒక్క హిందీలో తప్ప మిగిలిన అన్ని చోట్ల ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది.
మొదటి రోజు తప్ప రెండో రోజు నుండి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగిన కలెక్షన్స్ ను నమోదు చేయలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 5.75 cr |
సీడెడ్ | 1.88 cr |
ఉత్తరాంధ్ర | 1.81 cr |
ఈస్ట్ | 0.88 cr |
వెస్ట్ | 0.56 cr |
గుంటూరు | 1.02 cr |
కృష్ణా | 0.73 cr |
నెల్లూరు | 0.55 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 13.18 cr |
తమిళనాడు | 0.35 cr |
కేరళ | 0.30 cr |
కర్ణాటక | 1.10 cr |
హిందీ | 9.28 cr |
ఓవర్సీస్ | 3.43 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 27.64 cr |
‘లైగర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.82.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.85 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.27.64 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. మొత్తంగా బయ్యర్స్ కు ఈ మూవీ రూ.57.36 కోట్ల నష్టాలను మిగిల్చి ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలింది.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!