వాట్ లగా దేంగే, దేశాన్ని షేక్ చేస్తాం అంటూ థియేటర్లలోకి వచ్చిన ‘లైగర్’.. ఓటీటీలోకి మాత్రం సడీసప్పుడు లేకుండా ఎంట్రీ ఇచ్చేశాడు. విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్‌లకు పీడకలగా మారిన ‘లైగర్’ సినిమా రూమర్లను నిజం చేస్తూ ఈ రోజు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘లైగర్’ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముందుగా చెప్పినట్లు అధికారికంగా ప్రకటించడం కానీ, ప్రమోషన్స్ కానీ లేకుండా చిన్న ట్వీట్‌తో సడెన్‌గా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేసింది.
హాట్‌స్టార్‌లో ‘లైగర్’ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే వీటిపై ఎవరూ స్పందించలేదు. ఈ సినిమా గురించి పూరి, ఛార్మి, విజయ్ మాట్లాడతారు అనుకోవడం అత్యాశే. అయితే హాట్‌స్టార్ మాత్రం నిన్న మధ్యాహ్నం ‘I am f..f..f.. Fighter’ అంటూ ఓ ట్వీట్ చేసింది. దాంతోనే కన్ఫర్మేషన్ కాని కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. మరి ఓటీటీల్లో ఈ సినిమా ఏం చేస్తుందో చూడాలి. ఇక్కడైనా కాస్త వ్యూయర్‌షిప్ బాగుంటే.. కాస్త విజయ్ యాటిట్యూడ్‌కి జస్టిఫికేషన్ వస్తుంది.
ఓసారి సినిమా కథ కూడా చూస్తే.. బాగుంటుంది అనిపిస్తోందా? అయితే చదివేయండి. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA)లో తన కొడుకు లైగర్ (విజయ్)ని జాతీయ ఛాంపియన్‌గా చూడాలనేది బాలామణి (రమ్యకృష్ణ) కోరిక. తన భర్త కూడా ఫైటర్ కావడం గమనార్హం. అందుకే తన కల కోసం కరీంనగర్ నుంచి లైగర్‌ను పట్టుకుని ముంబయికి చేరుకుంటుంది. తన కొడుకుతో కలసి ఓ టీ స్టాల్ నడుపుతుంటుంది. తన కల నెరవేర్చుకోవాలంటే అమ్మాయిల జోలికి వెళ్లొద్దని తన కొడుకుకి చెబుతుంటుంది.
కానీ లైగర్.. తానియా (అనన్య పాండే)తో ప్రేమలో పడతాడు. అయితే లైగర్‌కి నత్తి ఉందని తెలిసి తానియా దూరమవుతుంది. ప్రేమలో పడి విఫలమైన లైగర్ తన కలను నెరవేర్చుకున్నాడా లేదా, అసలు లైగర్ ముంబయి నుండి లాస్ వేగాస్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది కథ.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!