Liger Movie: ‘క్రాస్‌ బ్రీడ్‌’ని కంటిన్యూ చేస్తారట.. కానీ?

ఓ సినిమా ఇంకా రిలీజ్‌ కాకుండానే దానికి సీక్వెల్‌ ఉంటుందా? ఉంటుంది? ఉండొచ్చు? అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నల్లాంటి టీజర్‌ల వెనుక రెండు కారణాలు ఉంటాయి. ఒకటి సినిమా మీద అంచనాలు పెంచడానికి, రెండోది సినిమా మీద మాకు బాగా నమ్మకం ఉంది అని చెప్పడానికి. ఈ రెండూ కాకుండా నిజంగా సీక్వెల్ ఉండి ఉండాలి. అయితే ఈ మూడింటిలో ఏ కారణమో తెలియదు కానీ ‘లైగర్‌’కి అయితే సీక్వెల్‌ ఉందట.

ఈ మాటను ఎవరో చెబితే, ఇంకెవరో అడిగితే నమ్మడానికి ఆలోచించేవాళ్లం. కానీ సినిమా నిర్మాత, దర్శకుడు, హీరో మధ్య జరిగిన డిష్కషన్‌ ఇంటర్వ్యూలోనే ఈ విషయం వచ్చింది. ‘లైగర్‌’ దర్శకుడు పూరి జగన్నాథ్‌, హీరో విజయ్‌ దేవరకొండను నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఆ ఇంటర్వ్యూలో సీక్వెల్‌ గురించి ఓ ప్రశ్న వచ్చింది. దానికి విజయ్‌, పూరి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. దీంతో సీక్వెల్‌ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది.

‘లైగర్’కి సీక్వెల్ ఉంటుందా..? అని ఛార్మి ప్రశ్నించగా.. ఉండొచ్చని, ఉండే అవకాశం ఉంది అని విజయ్‌ సమాధానమిచ్చాడు. అయితే ఇప్పుడే సీక్వెల్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నాడు. ‘లైగర్’ సినిమా భారీ హిట్ అయ్యి.. మంచి వసూళ్లు వస్తే… కచ్చితంగా సీక్వెల్ ఆలోచన వస్తుంది అని చెప్పాడు. ఆ లెక్కన ‘లైగర్‌’ రిజల్ట్ బట్టి సీక్వెల్ ఉంటుందా? లేదా? అనే విషయంలో క్లారిటీ వస్తుంది. ఆగస్టు 25న దీనిపై స్పష్టత పూర్తిగా వచ్చేస్తుంది.

దర్శకుడు పూరి జగన్నాథ్‌ అయితే మరో విషయం చెప్పారు. ‘లైగర్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘లైగర్‌ 2’ చిత్రం చేయమని తొలిసారి కరణ్‌ జోహార్ అడిగారని చెప్పారు. మరి నిజంగానే ‘లైగర్‌’ ఆలోచన ఉందా. లేక ప్రచారం కోసం చెప్పారా అనేది తొలి సినిమా ఫలితం బట్టి తెలిసిపోతుంది. గతంలో ఇలా కొన్ని సినిమాలు సీక్వెల్‌ అంటూ అనుకున్నా.. ఆఖరికి వచ్చేసరికి మాటలకే పరిమితం అయిపోయాయి. మరి విజయ్‌ – పూరి ఏం చేస్తారో చూడాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus