Liger Story: అలా కథ చెబితే విజయం పక్కా అంటున్న బాలయ్య!

  • January 20, 2022 / 05:21 AM IST

కట్టె..కొట్టె.. తెచ్చే! ఈ మూడు పదాలతో రామాయణం చెప్పేయొచ్చు అంటారు పెద్దలు. నిజానికి ఆ మూడు పదాల్లోనే రామాయణం ఉంది కూడా. అలాగే సినిమా కథను ఐదు పదాల్లో చెప్పేస్తే… అవును చెప్పేయొచ్చు అంటున్నారు పూరి జగన్నాథ్‌. అంతేకాదు అలా చెప్పగలిగితే సినిమా హిట్‌ అంటున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవల ఈ ఇద్దరు ‘అన్‌స్టాపబుల్‌’ షోలో సందడి చేశారు బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న ఈ షోకి పూరి, ఛార్మి, విజయ్‌ దేవరకొండ వచ్చారు. అప్పుడు సినిమా కథేంటో ఐదు ముక్కల్లో చెప్పమని పూరిని బాలయ్య అడిగారు. దాంతో ఆయన చెప్పేశారు.

ఏంటీ… ఐదు ముక్కల్లో కథ చెప్పేయొచ్చా అంటారా. ఎందుకు చెప్పలేం మూడు ముక్కల్లో రామాయణం చెప్పినప్పుడు ఐదు ముక్కల్లో సినిమా కథ చెప్పలేమా. అందుకే పూరి చెప్పేశారు కూడా. అదే తల్లి, కొడుకు, ప్రేమ, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌, మైక్ టైసన్‌. అవును ఇదే ‘లైగర్‌’ కథ అంట. ఆయన ఇంత సులభంగా చెప్పేసినా… అందులో చాలా నిగూడార్థం ఉంది అనేది మనకు తెలిసిపోతుంది. సినిమా తల్లీ – కొడుకుల కథ అని టీజర్‌ వీడియో చూస్తేనే తెలిసిపోతుంది. అంతేకాదు ఇందులో మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ను చూపిస్తున్నారని తెలిసిపోతుంది.

దాంతోపాటు ఈ సినిమాలో మైక్‌ టైసన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారని కూడా చిత్రబృందం ఇప్పటికే తెలిపింది. సో పూరి జగన్నాథ్‌ కొత్తగా చెప్పిందేమీ లేదు. మనం తెలుసుకున్నది ఏమీ లేదు. మధ్యలో ప్రేమ ఉంది కదా అంటారా. పూరి సినిమాల్లో ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది. పక్కా మాస్‌ మసాలా సినిమా తీసినా… అందులో తనదైన శైలిలో ప్రేమను చొప్పించడం ఆయనకు అలవాటు. అదే ఈ సినిమాలో కూడా చూపించారు. దీనికి తోడు ఆయన భావజాలం, సిద్ధాంతాలు కూడా ఇందులో ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సినిమా కథను ఇలా చెప్పాక… బాలయ్య మెచ్చుకుంటూ ‘‘ఇలా సినిమా కథను సులభంగా చెప్పగలిగితే ఆ సినిమా పక్కాగా విజయం సాధించినట్లే అని కూడా అన్నారు. మరిది అవునో కాదో ఆగస్టు 25న తెలిసిపోతుంది. అది కూడా కరోనా కనుకరిస్తేనే.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus