Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 10, 2026 / 06:11 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ప్రదీప్ రంగనాథన్  (Hero)
  • కృతి శెట్టి (Heroine)
  • ఎస్ జె సూర్య, యోగి బాబు, ఆనంద్ రాజ్, సీమన్, మాళవిక, సునీల్ రెడ్డి తదితరులు (Cast)
  • విగ్నేష్ శివన్  (Director)
  • నయనతార, ఎస్ ఎస్ లలిత్ కుమార్  (Producer)
  • అనిరుథ్ రవిచంద్రన్  (Music)
  • రవి వర్మన్  (Cinematography)
  • ప్రదీప్ ఇ రాఘవ్  (Editor)
  • Release Date : 10 ఏప్రిల్ 2026
  • రౌడీ పిక్చర్స్సె & వెన్ స్క్రీన్ స్టూడియో (Banner)

ప్రదీప్ రంగనాథన్ తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అతని నుండి ఓ సినిమా వస్తుందంటే సహజంగా అంచనాలు ఉన్నాయి. ‘లవ్ టుడే’ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. యువతనే మెయిన్ గా టార్గెట్ చేసుకుని ప్రదీప్ రంగనాథన్ సినిమాలు చేస్తుంటారు. తాజాగా అతను ‘ఎల్ ఐ కె'(LIK – లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందు వచ్చింది. మరి ఈ సినిమా ప్రదీప్ ఖాతాలో ఇంకో సక్సెస్ ఫుల్ మూవీగా మిగిలిందో లేదో తెలుసుకుందాం రండి:

LIK Movie Review

LIK Movie Review And Rating

కథ: 2040లలో జరిగే కథ ఇది. వాసు అలియాస్ వైబ్ వాసు(ప్రదీప్ రంగనాథన్) ఫోన్లు వంటి వాటికి దూరంగా పెరుగుతాడు. అతని సోదరి ఫోన్ వాడుతూ ఓ యాక్సిడెంట్లో మరణిస్తుంది. అందువల్ల ‘ఆర్గానిక్ లివింగ్ వరల్డ్’ అనే ఫోన్లు లేని ప్రపంచాన్ని సృష్టించి వాసుని అక్కడే పెంచుతాడు అతని తండ్రి(సీమన్). మరోపక్క లవ్ లైఫ్ కి కూడా ఇన్సూరెన్స్ అవసరమని యువతని మభ్యపెట్టి ‘ఎల్ ఐ కె’ అనే కంపెనీని,యాప్ ని స్థాపిస్తాడు సూర్య(ఎస్ కె సూర్య). ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ఆ యాప్ ని క్రియేట్ చేసి.. యువత చేతుల్లో పెట్టి.. వాళ్ళందరి ఫ్యూచర్ ని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. ఇక ఇతని ఎల్ ఐ కె యాప్ కి వాయిస్ ఇచ్చే ఎంప్లాయ్ గా జాయిన్ అవుతాడు వాసు. ఇదే క్రమంలో ధీమా(కృతి శెట్టి) అనే అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ధీమా కూడా ఎల్ ఐ కె సబ్స్క్రైబర్.

తల్లి(మాళవిక) పెంపకం సరిగ్గా లేకపోవడం వల్ల ధీమా ఫోన్ కి.. ఏఐకి బానిసవుతుంది. ఆమె కోసం తాను కూడా ఫోన్ తీసుకుని ఎల్ ఐ కె యాప్ సబ్స్క్రైబర్ గా మారతాడు వాసు. ఇద్దరూ పెళ్ళిచేసుకుని ఒక్కటవుదామనుకునే టైంలో అదే యాప్ లో ఇద్దరూ లవ్ స్కోర్ చెక్ చేసుకుంటే 100 కి 3 పాయింట్లు మాత్రమే వస్తాయి. దీంతో వాసుకి బలవంతంగా బ్రేకప్ చెప్పేస్తుంది ధీమా. అయితే వాసు మాత్రం నిజమైన ప్రేమకి యాప్ కంటే కూడా హార్ట్ ముఖ్యమని చెప్పి కన్విన్స్ చేయాలనుకుంటాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోదు. ఈ క్రమంలో సూర్య ఎల్ ఐ కె యాప్ ఫ్రాడ్ అని ప్రూవ్ చేస్తానని సవాలు విసురుతాడు. దీనికి సూర్య ఎలా రియాక్ట్ అయ్యాడు.? చివరికి వాసు, ధీమా ఒక్కటయ్యారా? లేదా? అనేది మిగిలిన కథ.

LIK Movie Review And Rating

నటీనటుల పనితీరు: ప్రదీప్ రంగనాథన్ రెగ్యులర్ అయిపోతున్నాడు. అన్ని సినిమాల్లోనూ ఒక్కటే లుక్, ఒక్కటే రోల్. ‘లవ్ టుడే’ ‘డ్రాగన్’ ‘డ్యూడ్’ సినిమాల్లో అతని నటన ఎలా ఉంటుందో ఈ ‘ఎల్ ఐ కె’ లో కూడా అలానే ఉంటుంది. అతను కొత్తగా చేసింది ఏమీ లేదు. అందువల్ల ఎమోషనల్ గా కూడా అతని పాత్రతో కనెక్ట్ అవ్వలేము, ట్రావెల్ అవ్వలేము. హీరోయిన్ కృతి శెట్టి కూడా అంతే. నటన పరంగానే కాదు కనీసం లుక్స్ పరంగా కూడా ఆమె ఆకట్టుకోలేకపోయింది. ఎస్ కె సూర్య మాత్రం ఎప్పటిలానే తన పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాని ప్రేక్షకుడు చివరి వరకు చూడగలిగాడు అంటే అది అతని నటన వల్లే అని చెప్పాలి. అలాగే హీరో తండ్రి పాత్ర చేసిన సీమన్ కూడా బాగా చేశాడు. అతని పాత్రలో డెప్త్ కూడా ఉంది. కానీ ఆ పాత్రని సరిగ్గా వాడుకోకపోవడం బాధాకరం. సీనియర్ హీరోయిన్ మాళవిక ఈ సినిమాలో తల్లి పాత్ర చేసింది. కానీ ఆ పాత్ర కూడా తేలిపోయింది. యోగిబాబు కామిడీ పండలేదు. గౌరి జి కిషన్ అక్కడక్కడా మెరిసింది.

LIK Movie Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: నయనతార భర్త విగ్నేష్ శివన్ ఈ సినిమాకి దర్శకుడు. నయనతార కూడా ఓ నిర్మాత. అందువల్ల ఈ ‘ఎల్ ఐ కె’ తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఈ కాంబో అనగానే మనం మినిమమ్ గ్యారెంటీ సినిమాని ఆశిస్తాం. కానీ ఆ అంచనాలు ఈ సినిమా మ్యాచ్ చేయలేదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు హీరో ప్రదీప్ రంగనాథన్ రెగ్యులర్ అయిపోతున్నాడు. ప్రతి సినిమాలోనూ ఒక్కటే లుక్, ఒక్కటే పాత్ర చేసేస్తున్నాడు. కథ కథనాలు కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటున్నాయి. ‘ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్ ని టార్గెట్ చేసే కామెడీ, ఇంటర్వెల్ కి అతని లవ్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం.. అందులో కొన్ని కండిషన్స్ ఫేస్ చేయాల్సి రావడం. సెకండాఫ్ లో వాటిని సాల్వ్ చేసుకునే ప్రాసెస్. క్లైమాక్స్ ని ఎమోషనల్ గా నింపేయడం’ ఇదే టెంప్లేట్లో అతని సినిమాలు ఉంటున్నాయి. ‘ఎల్ ఐ కె’ కథ కథనాలు కూడా ఇలానే ఉంటాయి.

కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ‘లవ్ టుడే’ ‘డ్రాగన్’ సినిమాల్లో పండిన కామెడీ, ఎమోషన్ ఇందులో కొంచెం కూడా పండలేదు. పైగా అవి విసిగిస్తాయి. దర్శకుడు విగ్నేష్ శివన్  కథకుడిగా మంచి లైన్ తీసుకున్నా దర్శకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు. సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే.. అందులో అనిరుథ్ మ్యూజిక్, రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అని చెప్పాలి. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో లాక్కురావాలని శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ‘ధీమా ధీమా’ సాంగ్ మాత్రం సూపర్ గా ఉంది. ధియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా ఆ పాట వెంటాడుతుంది అనడంలో సందేహం లేదు.

LIK Movie Review And Rating

విశ్లేషణ: ఓ మంచి లైన్ తీసుకుని ప్రదీప్ రంగనాథన్ సినిమాల రెగ్యులర్ టెంప్లేట్లో తీస్తే అది ‘ఎల్ ఐ కె’. ఆసక్తికర స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కుదరకపోవడం వల్ల ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది ఈ సినిమా.

LIK Movie Review And Rating

ఫోకస్ పాయింట్: లైక్(‘LIK’E) చేయడం కష్టం

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #LIK movie

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

trending news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

38 mins ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

8 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

13 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

13 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

14 hours ago

latest news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

15 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

1 day ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version