Pawan Kalyan: కోర్టు తీర్పుతో ఫ్యాన్స్‌లో సందడి.. ఎప్పుడు రిలీజ్‌?

  • July 14, 2022 / 01:20 PM IST

‘భీమ్లా నాయక్‌’ రిలీజ్‌కు ముందు ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తాం అని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ చెప్పింది. అయితే విడుదల తేదీ దగ్గరపడేసరికి ఆ సినిమా డబ్‌డ్‌ వెర్షన్‌లో హిందీలో రావడం లేదు అని వార్తలొచ్చాయి. సినిమా తెలుగులో వచ్చింది… విజయం సాధించింది.. వెళ్లిపోయింది. కానీ ఇంకా హిందీలో విడుదల కాలేదు. అయితే ఇప్పుడు హిందీ వెర్షన్‌ విడుదలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఇంతకీ ఏమైందంటే.

మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను తెలుగులో ‘భీమ్లా నాయక్’గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా కీలక పాత్రధారులు. ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ ప్లాన్ చేసిందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు కూడా. అయితే ఈ సినిమా హిందీ రిమేక్, డబ్బింగ్ హక్కులు పొందిన ప్లాంటిఫ్‌ జేఏ ఎంటర్‌టైన్మెంట్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీంతో ‘భీమ్లా నాయక్’ హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌ అగిపోయింది.

ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. తెలుగులో చిత్రీకరించిన ‘భీమ్లా నాయక్’ సినిమాను హిందీలో డబ్ చేయడం తగదని, ఇది కాపీరైట్స్ ఉల్లంఘన కిందకు వస్తుందని జేఏ ఎంటర్‌టైన్మెంట్ తరపు న్యాయవాదులు వాదించారు. ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ను హిందీలో రీమేక్, డబ్బింగ్ చేసే హక్కులు తమకే ఉన్నాయని వారు వాదనల్లో వినిపించారు. ‘భీమ్లా నాయక్’ను హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేయకుండా నిలిపేయాలని కోరారు. అయితే ఈ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది.

కాపీరైట్స్‌ను కొనుగోలు చేసిన నిర్మాణ సంస్థకు హిందీతో సహా ఏ భాషలోనైనా ఆ సినిమాని డబ్ చేసే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్ణయాన్ని అడ్డుకొనేందుకు జేఏ ఎంటర్‌టైన్మెంట్స్‌కు ఎలాంటి హక్కును ఉండదని తెలిపింది. ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌ హక్కులను జేఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ 2020 జులైలోనే కొనుగోలు చేసింది. అయితే ఆ సంస్థ హిందీలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుని షూటింగ్ మొదలుపెట్టేలోపే ‘భీమ్లా నాయక్’ తెలుగులో విడుదలైంది.

ఆ సినిమాలో హిందీలో డబ్బింగ్‌ చేసి, ట్రైలర్ కూడా విడుదల చేసింది. దీంతో జేఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ కోర్టును ఆశ్రయించింది. సితార వాళ్లకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో ‘భీమ్లా నాయక్’ హిందీ వెర్షన్‌ విడుదలకు లైన్ క్లియర్ అయినట్లే. మరి ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చూడాలి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus