బన్నీతో పొసగక.. ఎన్టీఆర్ తో

అల్లు అర్జున్ తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసిన దర్శకులలో తమిళ దర్శకుడు లింగుస్వామి ఒకరు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ముందు నుండి ఈ సినిమా చర్చల్లో ఉంది. ఈ సినిమాతో తమిళంలో సత్తా చాటాలనుకున్నాడు బన్నీ. ఎక్కడ ఏం జరిగిందో కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. బన్నీ కోసం ‘పందెంకోడి’ సీక్వెల్ ని పక్కన పెట్టిన లింగుసామి మనస్తాపం చెందారు. అయితే అదే కథ యంగ్ టైగర్ వద్దకు చేరిందట.

‘జనతా గ్యారేజ్’ తర్వాత చేయనున్న సినిమాల కోసం కథల వింటున్న ఎన్టీఆర్ లింగుసామి చెప్పిన కథని విన్నారట. దీనికి ఎన్టీఆర్ సుముఖంగా ఉన్నారని వినికిడి. ‘టెంపర్’ తర్వాత ఎన్టీఆర్ పూరితో మరోసారి చేతులు కలుపుతారన్న నేపథ్యంలో లింగుసామి ప్రయత్నం ఈసారి ఎంతవరకు ఫలిస్తుందో మరి. అటు ఎన్టీఆర్ కోసం ఇన్నాళ్లు కాపు గాసిన రచయిత వక్కంతం వంశీ బన్నీ దగ్గర చేరారట. దీంతో బన్నీ-లింగుసామి, ఎన్టీఆర్-వక్కంతం వంశీ కాంబినేషన్లు తిరగబడ్డాయన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus