Linguswamy, Allu Arjun : అల్లు అర్జున్ తో టచ్ లోనే ఉన్నా..: లింగుస్వామి

తమిళ దర్శకులతో మన హీరోలు చాలా కాలంగా సినిమాలు చేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లలో కోలీవుడ్ దర్శకుల జోరు తగ్గింది. మన దర్శకుల క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే తమిళ దర్శకుల వెంట పడడం మానేశారు మన హీరోలు. అయితే ఇటీవల తెలుగు హీరోల మార్కెట్ పెరిగిపోవడంతో తమిళ దర్శకులే తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి వెంపర్లాడుతున్నారు. ‘రన్’, ‘పందెం కోడి’, ‘ఆవారా’, ‘వెట్టై’ వంటి సినిమాలతో భారీ విజయాలు అందుకొని ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు లింగుస్వామి.

ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారు టాలీవుడ్ హీరోలు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. వీరిమధ్య కథా చర్చలు కూడా జరిగాయి. ఒక సినిమా కూడా చేయాలనుకున్నారు. కానీ లింగుస్వామికి వరుసగా ‘సికిందర్’, ‘పందెం కోడి 2’ లాంటి డిజాస్టర్స్ రావడం.. అదే సమయంలో బన్నీ క్రేజ్ పెరిగిపోవడంతో వారి కాంబినేషన్ లో సినిమా హోల్డ్ లో పడింది. దీంతో లింగుస్వామి.. హీరో రామ్ తో ‘ది వారియర్’ అనే సినిమా తీశారు.

ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు ఆయన. ఈ సినిమా ఆయన కెరీర్ కి చాలా కీలకం. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తెలుగు స్టార్లతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు లింగుస్వామి. అల్లు అర్జున్ తో సినిమా గురించి కూడా మాట్లాడారు. ‘బన్నీతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటా. కథలు గురించి మాట్లాడుతుంటాం. పదిహేను రోజులు క్రితం కూడా బన్నీని కలసి మాట్లాడా.

మా ఇద్దరి కలయికలో తప్పకుండా సినిమా వస్తుంది’ అంటూ నమ్మకంగా చెప్పారాయన. అలానే మహేష్ బాబు, ఎన్టీఆర్‌లతోనూ తాను సినిమాలు చేయాల్సిందని.. వారితో గతంలో సంప్రదింపులు జరిగాయని.. భవిష్యత్తులో కుదిరితే చేస్తానని చెప్పుకొచ్చారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus