యువ హీరో నాగ శౌర్య టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. విభిన్నమైన ప్రేమ కథలు చేయడమే కాకుండా అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆ మధ్య ఎవరూ ఊహించని విధంగా లక్ష్య అనే డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు చేసిన సినిమాలు అన్నీ కూడా నాగశౌర్య ఏదో ఒక కొత్త పాయింట్ ను హైలెట్ చేస్తూ ఉన్నాడు.
సక్సెస్ తో సంబంధం లేకుండా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న నాగశౌర్య తదుపరి సినిమా కృష్ణ వ్రింద విహారితో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు నాగశౌర్యకు అలాగే జూనియర్ ఎన్టీఆర్కు బంధుత్వం ఉంది అని అనేక రకాల కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ వార్తలు ఎన్నిసార్లు వైరల్ అయిన కూడా ఇరు కుటుంబ సభ్యుల నుంచి మాత్రం కొంచెం కూడా క్లారిటీ అయితే రాలేదు.
ఇక ఫైనల్ గా కృష్ణ వ్రింద విహారి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నాగశౌర్య తల్లి ఉషా మూల్పూరు ఒక వివరణ ఇచ్చారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగశౌర్య తో ఎన్టీఆర్ కుటుంబానికి ఉన్న అనుబంధంపై మాట్లాడుతూ నిజానికి ఆ వార్తలు నేను కూడా విన్నాను అని అలా వార్తలు రావడానికి ఒక కారణం ఉంది అని ఆమె అన్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి కజిన్ నాగశౌర్య కు మంచి ఫ్రెండ్ కావడం వలన అటువైపు నుంచి వార్తలు ఎక్కువగా వచ్చి ఉంటాయి.
ఆ విధంగా ఎన్టీఆర్ కుటుంబానికి నాగశౌర్య ఏదైనా లింక్ ఉండవచ్చు అని అనుకున్నారు. అంతే తప్పితే నిజానికి ఆ కుటుంబానికి తమకు రిలేషన్షిప్ ఏమీ లేదు అని నాగశౌర్య తల్లి తెలియజేసింది. కానీ కలిసినప్పుడు మాత్రం ఫ్యామిలీ బాండింగ్ ఉంటుందని అన్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!