RRR, Rajanna: ఆర్ఆర్ఆర్ విషయంలో విజయేంద్ర అలా చేశారా?

  • March 30, 2022 / 03:30 PM IST

విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో నాగార్జున ప్రధాన పాత్రలో తెలంగాణ రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన రాజన్న మూవీ 2011 సంవత్సరంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్ కోరిక మేరకు ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు మాత్రం రాజమౌళి దర్శకత్వం వహించారు. అయితే రాజన్న సినిమాకు ఈ ఏడాది విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమాకు కొన్ని పోలికలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Click Here To Watch NOW

రాజన్న సినిమా మల్లమ్మ అనే పాప చుట్టూ తిరిగితే ఆర్ఆర్ఆర్ సినిమా మల్లి అనే పాప పాత్ర చుట్టూ తిరుగుతుంది. రాజన్న సినిమాలో నాగార్జున జనాల్ని ఉత్తేజితులను చేయడం కొరకు డప్పు కొడుతూ ఊపిరి జెండా ఎగరేయ్ అనే పాట పాడతారు. ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీముడో సాంగ్ ద్వారా అక్కడి ప్రజల్లో మార్పు వచ్చేలా చేసి వాళ్లు పోలీస్ సిబ్బందిపై దాడికి దిగేలా చేస్తారు.

రాజన్న, ఆర్ఆర్ఆర్ సినిమాలకు రచయిత ఒక్కరే కావడంతో రాజన్న ప్రభావం ఆర్ఆర్ఆర్ సినిమాపై కొంతమేర ఉందని ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రను యాడ్ చేయడం వల్ల ఈ సినిమా ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి సైతం తనకు నచ్చిన కొన్ని సన్నివేశాలను పాత సినిమాల నుంచి స్పూర్తి పొందుతానని గతంలో వెల్లడించారు. మగధీర సినిమాలో గుర్రానికి సంబంధించిన ఒక సన్నివేశాన్ని కొదమ సింహం నుంచి తీసుకున్నానని జక్కన్న ఒక సందర్భంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ మూవీ వీక్ డేస్ లో కూడా భారీస్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. ఉగాది పండుగ సెలవు దినం ఆర్ఆర్ఆర్ సినిమాకు కలిసొస్తుందని చెప్పవచ్చు. ఈ ఆదివారం నాటికి ఆర్ఆర్ఆర్ మూవీ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus