చిరు టు వరుణ్.. వెంకీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోల లిస్ట్..!

‘కలియుగ పాండవులు’ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసిన వెంకటేష్ ఇప్పటివరకు 76 సినిమాల్లో నటించారు. ఇందులో రెండు బాలీవుడ్ సినిమాలు ఉండడం విశేషం. ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్, బాబా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత డా.డి.రామానాయుడు గారి చిన్నబ్బాయిగా హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనతి కాలంలోనే తన సొంత ట్యాలెంట్ తో టాప్ హీరోగా ఎదిగారు వెంకటేష్. కొన్నాళ్ల తర్వాత వెంకటేష్ కు తన అన్నయ్య సురేష్ బాబు కూడా అండగా నిలబడ్డారు. సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లలో అత్యధిక హిట్ పెర్సెంటేజ్ కలిగిన హీరోగా వెంకటేష్ ఉన్నారు. అందుకే ‘విక్టరీ’ అతని ఇంటి పేరు అయిపోయింది.

అయితే ఎంత స్టార్ హీరో అయినా, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ సంపాదించుకున్నా, లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కలిగిన హీరో అయినా చాలా సింపుల్ గా ఉంటారు వెంకటేష్. అతని పై ఎటువంటి నెగిటివిటీ ఉండదు. ఓ సందర్భంలో నాని చెప్పినట్టు వెంకటేష్ ఓ అచ్చ తెలుగు ఆవకాయ లాంటి వారు. ఈయనంటే ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు అనడంలో కూడా అతిశయోక్తి లేదు.తన సినిమాలు ఎంత కలెక్ట్ చేశాయి, ఎన్ని రికార్డులు కొట్టాయి అనే విషయాలను కూడా వెంకీ పట్టించుకోరు. తన సినిమాల రిలీజ్ టైంలో తప్ప మిగిలిన టైములో ఆయన బయట ఎక్కువగా కనిపించరు. అంత హుందాగా ఉంటారు వెంకీ. ఎటువంటి ఇగో లేకుండా ఈయన చాలా మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వెంకీతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) వెంకటేష్ – చిరంజీవి:

‘త్రిమూర్తులు’ చిత్రంలో చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు వెంకీ. కె.మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ హీరోగా నటించారు. ఓ స్పెషల్ సాంగ్ లో చిరుతో వెంకీ కనిపిస్తారు.

2) వెంకటేష్ – బాలకృష్ణ :

‘త్రిమూర్తులు’ చిత్రంలోని స్పెషల్ సాంగ్లోనే వెంకీతో బాలయ్య కూడా కనిపిస్తారు.

3) వెంకటేష్ – నాగార్జున :

‘త్రిమూర్తులు’ చిత్రంలోని స్పెషల్ సాంగ్లోనే వెంకీతో నాగార్జున కూడా కనిపిస్తారు.

4) వెంకటేష్ – కమల్ హాసన్ :

‘ఈనాడు’ చిత్రంలో వీళ్ళు కలిసి నటించారు. వీరి కాంబినేషన్లో అంతకు ముందు ‘మర్మయోగి’ చిత్రం కూడా మొదలయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

5) వెంకటేష్ – తరుణ్ :

వెంకటేష్ హీరోగా నటించిన ‘సూర్య ఐపిఎస్’ చిత్రంలో తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. కానీ తరుణ్ హీరోగా నటించిన ‘సోగ్గాడు’ చిత్రంలో వెంకటేష్ ఓ సాంగ్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారు. అలా తరుణ్ తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

6) వెంకటేష్ – జూ.ఎన్టీఆర్ :

వెంకటేష్ హీరోగా నటించిన ఓ స్పెషల్ సాంగ్లో ఎన్టీఆర్ గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తాడు. అలా ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు వెంకీ.

7) వెంకటేష్ -రానా :

రానా హీరోగా తెరకెక్కిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో వెంకీ కనిపిస్తారు. రానాతో కలిసి వెంకీ అలా కాసేపు డ్యాన్స్ చేస్తారు.

8) వెంకటేష్ – మహేష్ బాబు :

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే.

9) వెంకటేష్ -రామ్ :

‘మసాలా’ చిత్రంలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు.

10) వెంకటేష్ – పవన్ కళ్యాణ్ :

‘గోపాల గోపాల’ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. అలాగే ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో కూడా వీళ్ళిద్దరూ కలిసి ఓ సీన్లో కనిపిస్తారు.

11) వెంకటేష్ – నాగ చైతన్య :

‘వెంకీ మామ’ చిత్రంలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. అలాగే ‘ప్రేమమ్’ చిత్రంలో కూడా నాగ చైతన్యతో కలిసి ఓ సీన్లో కనిపించారు వెంకీ.

12) వెంకటేష్ – వరుణ్ తేజ్ :

‘ఎఫ్2’ మూవీలో కలిసి నటించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘ఎఫ్3’ కూడా కలిసి నటించారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus