సీక్వెల్స్ కి ఉండే క్రేజే వేరు. ఓ సక్సెస్ఫుల్ సినిమాలోని క్యారెక్టర్స్ తీసుకుని మరో మంచి కథ చెప్పడం అంటే అందరిలోనూ ఆసక్తి ఏర్పడుతుంది.ఆ సినిమాలకి బిజినెస్ కూడా బాగా జరుగుతుంది.వాటికి కనుక ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించడం ఖాయం.2025లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన సీక్వెల్స్ థియేటర్లలోకి వచ్చాయి. పాత కథలకు కొనసాగింపుగా, కొత్త హంగులతో ఆడియెన్స్‌ను అలరించాయి. భారీ అంచనాలతో విడుదలైన ఆ పాపులర్ సీక్వెల్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
అఖండ 2: తాండవం : మహా కుంభమేళా బ్యాక్‌డ్రాప్‌లో సాగే బయోవార్ కథ ఇది. ఓ చిన్నారి సైంటిస్ట్‌ను కాపాడటానికి అఖండ మళ్లీ తిరిగొస్తాడు. తనదైన ఉగ్రరూపంతో, డివైన్ పవర్‌తో శత్రువుల భరతం పడతాడు.

థండర్ బోల్ట్స్ : మారిపోయిన కొందరు విలన్లు హీరోలుగా చేసే మిషన్ ఇది. తమ గతాన్ని తలచుకుంటూ, సెంట్రీ అనే పవర్ ఫుల్ శక్తితో వీళ్ళు చేసే పోరాటం ఆసక్తికరంగా ఉంటుంది.

హిట్ 3 : పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ చుట్టూ తిరిగే కథ ఇది. ఆర్గాన్ ట్రాఫికింగ్ మాఫియా, ఒక క్రూరమైన కల్ట్ ముఠాను వేటాడే క్రమంలో అర్జున్ ఎలాంటి భయంకరమైన సవాళ్లు ఎదుర్కొన్నాడనేది ఇందులో చూడొచ్చు. ఇది హిట్(HIT) యూనివర్స్‌లో మరో కీలక మలుపు.

జురాసిక్ వరల్డ్- రీబర్త్: డైనోసార్ డీఎన్ఏ కోసం వెళ్లిన ఒక సీక్రెట్ టీమ్ కథ ఇది. ప్రాణాంతకమైన మ్యుటేటెడ్ జీవులు, కార్పొరేట్ కుట్రల మధ్య ఆ టీమ్ ఎలా బయటపడిందనేది ఉత్కంఠ రేపుతుంది.

ట్రాన్- ఏరెస్ : డిజిటల్ ప్రపంచం నుంచి రియల్ వరల్డ్‌లోకి వచ్చిన ఒక ప్రోగ్రామ్ స్టోరీ ఇది. టెక్నాలజీకి, మనుషులకు మధ్య ఉన్న గీత చెరిగిపోతే ఏమవుతుందో, ఆ కోడ్ కోసం కంపెనీలు ఎలా కొట్టుకుంటాయో ఇందులో చూపించారు.

అవతార్- ఫైర్ అండ్ యాష్ : జేక్ సల్లీ కుటుంబం ఈసారి నిప్పును ఆరాధించే కొత్త నవీ తెగతో తలపడుతుంది. పండోరా గ్రహాన్ని కాపాడుకోవడానికి అన్ని తెగలను ఏకం చేసి చేసే మరో భారీ యుద్ధమే ఈ సినిమా.
![]()
ప్రిడేటర్- బ్యాడ్‌ల్యాండ్స్ : బహిష్కరణకు గురైన ఒక ఏలియన్, మనిషిలాంటి రోబోతో చేతులు కలుపుతాడు. ప్రమాదకరమైన గ్రహంపై ఓ వింత మృగాన్ని వేటాడే సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది.

మిషన్: ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్ : ప్రపంచాన్ని నాశనం చేయగల ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నుంచి మానవాళిని కాపాడటానికి ఈథన్ హంట్ చేసే చివరి పోరాటం ఇది. అణుయుద్ధం ముప్పును తప్పించే హై-వోల్టేజ్ సాహసమిది.

కెప్టెన్ అమెరికా- బ్రేవ్ న్యూ వరల్డ్ : కొత్త కెప్టెన్ అమెరికాగా సామ్ విల్సన్ బాధ్యతలు తీసుకున్నాడు. అడమాంటియం కోసం జరిగే అంతర్జాతీయ కుట్రను, రెడ్ హల్క్ ఆగడాలను అడ్డుకోవడమే ఈ చిత్ర కథాంశం.

నోబడీ 2 : హచ్ మాన్సెల్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్తాడు. అక్కడ ఒక థీమ్ పార్క్ ఓనర్, క్రైమ్ బాస్ వల్ల చిక్కుల్లో పడతాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ వైలెన్స్ రూట్ ఎంచుకుంటాడు.

జూటోపియా 2 : జూడీ, నిక్ కలిసి ఈసారి సిటీలో జరుగుతున్న ఒక సీక్రెట్ కుట్రను ఛేదిస్తారు. సరీసృపాల వల్ల నగరానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని అడ్డుకోవడానికి, మారువేషాల్లో చేసే ఇన్వెస్టిగేషన్ ఇది.

ఫైనల్ డెస్టినేషన్- బ్లడ్ లైన్స్ : స్టెఫానీ అనే స్టూడెంట్‌కు జరగబోయే ప్రమాదాలు ముందే కనిపిస్తుంటాయి. తన అమ్మమ్మ గతం, చావు వల నుంచి తప్పించుకోవడానికి ఆమె చేసే ప్రయత్నమే ఈ బ్లడ్ లైన్స్.

ది కంజరింగ్- లాస్ట్ రైట్స్ : స్మర్ల్ ఫ్యామిలీని పట్టిపీడిస్తున్న దెయ్యాలను తరిమికొట్టడానికి వారెన్ దంపతులు రంగంలోకి దిగుతారు. ఈసారి శాపగ్రస్తమైన అద్దం, టైమ్ లైన్ ట్విస్టులతో భయపెట్టే ప్రయత్నం చేశారు.

ది ఫెంటాస్టిక్ ఫోర్- ఫస్ట్ స్టెప్స్ : 1960ల కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో సాగే సూపర్ హీరోల కథ. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే, విశ్వం నుంచి వచ్చిన పెను ముప్పును ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఎలా ఎదుర్కొందో చూపిస్తారు.

సూపర్ మ్యాన్ : క్రిప్టాన్ గ్రహం నుంచి భూమికి వచ్చిన బాలుడు క్లార్క్ కెంట్‌గా ఎలా పెరిగాడు? జర్నలిస్ట్‌గా సామాన్య జీవితం గడుపుతూనే, సూపర్ మ్యాన్‌గా లోకాన్ని ఎలా రక్షించాడన్నదే ఈ సరికొత్త రీబూట్ స్టోరీ.

