ఇండిపెండెన్స్ డే స్పెషల్: ఓటిటిలో రిలీజ్ కాబోతున్న మూవీస్ లిస్ట్!

క‌రోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కు జనాలు బాగా భయపడిపోయారు. అందుకే థియేట‌ర్లు తెరుచుకున్నా జనాలు ఎక్కువ శాతం రావడం లేదు. లో-బడ్జెట్ సినిమాలు మాత్రం బాగానే క్యాష్ చేసుకుంటున్నాయి.పెద్ద సినిమాలు ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.మీడియం రేంజ్ సినిమాలు ఎక్కువ శాతం ఓటిటిలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ ఆగష్ట్ రెండో వారంలో కూడా ఓటిటిలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ లిస్ట్ లో రెండు పెద్ద సినిమాలు కూడా ఉండడం విశేషం. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1)షేర్షా : సిద్దార్థ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘షేర్షా’ చిత్రానికి విష్ణువర్ధన్‌ దర్శకుడు.అమెజాన్‌ ప్రైమ్‌లో ఆగస్టు 12 న నుండీ ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.

2)భుజ్- ది ప్రైడ్‌ ఆఫ్ ఇండియా : అజయ్‌ దేవ్‌గణ్‌, సంజయ్‌దత్‌, శరద్‌ ఖేల్కర్‌, సోనాక్షి సిన్హా, ప్రణీత, నోరా ఫతేహి, అమ్మీ వ్రిక్‌ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ దుదియా భూజ్‌ను తెరకెక్కించాడు. ఆగస్టు 13న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.

3)నేత్రికన్ : నయనతార ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ ను దర్శకుడు మిలింద్‌ రావు తెరకెక్కించాడు. ఆగస్టు 13న డిస్నీఫ్లస్‌ హాట్‌స్టార్‌ లో ఈ మూవీ విడుదల కాబోతుంది.

4)కురుత్తి మలయాళ చిత్రం : ఆగష్ట్ 11న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది

5) మోడర్న్ లవ్ వెబ్ సిరీస్ : ఆగష్ట్ 13న ఆగష్ట్ 11 అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది

6)గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ తెలుగు డబ్బింగ్ : ఆగష్ట్ 14న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది

7) ఎవాంజిలిన్ థ్రైస్ అపాన్ ఎ టైమ్ : ఆగష్ట్ 13న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది

8)చతుర్మఖం : ఆగష్ట్ 13న ఆహాలో విడుదల కాబోతుంది

9) పి.వో,డెబ్య్లూ- బందీ యుద్ధ్ కే : ఆగష్ట్ 13న ఎం.ఎక్స్.ప్లేయర్ లో విడుదల కాబోతుంది

10)బ్రూక్లీన్ నైన్ : ఈ వెబ్ మూవీ ఆగష్ట్ 12న నెట్‎ఫ్లిక్స్ విడుదల కానుంది

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus