‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఈ ఏడాది అడవుల నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

  • December 20, 2022 / 10:13 AM IST

2022 మరో రెండు వారాల్లో ఫినిష్ కాబోతుంది. తెలుగు సినిమా చరిత్రలో ఈ 2022 సంవత్సరం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. అంతకు ముందు ఒక లెక్క.. ఇక తర్వాత ఒక లెక్క అని ఫిలిం మేకర్స్ కు హెచ్చరికలు జారీ చేసింది. ఒకే బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తే ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమా చూడ్డానికి సిద్ధంగా లేరు అని ప్రూవ్ చేసింది. గత ఏడాది అంటే 2021 చివర్లో వచ్చిన అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ అడవుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

దీంతో అడవి టాలీవుడ్ కు సక్సెస్ రూటు చూపించింది అని అంతా నమ్మినట్టు ఉన్నారు. అందుకే ఈ ఏడాది అడవుల బ్యాక్ డ్రాప్ లో కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ మల్టీస్టారర్ కూడా ఉంది. అయితే ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు అన్నీ సక్సెస్ కాలేదు. అయితే ఈ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటి? అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) భీమ్లా నాయక్ :

‘అడవి అమ్మ కాదు అమ్మోరు’ ఈ డైలాగ్ బాగా పేలింది. కానీ సినిమా మాత్రం ఓ మాదిరిగానే ఆడింది. అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ అడవుల బ్యాక్ డ్రాప్లో రూపొందిందే.

2) ఆర్.ఆర్.ఆర్ :

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రాంచరణ్ లు హీరోలుగా నటించిన ఈ భారీ మల్టీస్టారర్ కూడా అడవుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిందే. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్… పులితో ఫైట్ చేసే సన్నివేశానికి థియేటర్లో విజిల్సే విజిల్సు.

3) ఆచార్య :

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి – రాంచరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీ కూడా అడవుల నేపథ్యంలో రూపొందిన కథే. కానీ సినిమా మాత్రం జనాలు ఇంప్రెస్ చేయలేక డిజాస్టర్ అయ్యింది.

4) విరాట పర్వం :

రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా అడవుల బ్యాక్ డ్రాప్లో రూపొందినదే. కానీ సినిమా డిజాస్టర్ అయ్యింది.

5) రామారావు ఆన్ డ్యూటీ :

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా కొంతవరకు అడవి బ్యాక్ డ్రాప్ లో రూపొందినదే.

6) వాంటెడ్ పండుగాడ్ :

సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ మూవీ వచ్చి వెళ్లినట్టు కూడా జనాలకు తెలీదు. ఎందుకంటే ప్రమోషన్స్ అంత వీక్ అనమాట. అయితే ఈ మూవీ కూడా అడవి బ్యాక్ డ్రాప్ లో రూపొందింది.

7) లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ :

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ మూవీ కూడా కొంత పార్ట్ అడవి నేపథ్యంలో రూపొందింది. కానీ సినిమా ప్లాప్ అయ్యింది.

8) కొండా :

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా కొంత అడవుల నేపథ్యంలో రూపొందిన మూవీనే..! ఇది కూడా వచ్చి వెళ్లినట్టు జనాలకు తెలీదు.

9) కాంతార :

ఈ డబ్బింగ్ సినిమా కూడా అడవుల నేపథ్యంలో రూపొందిన సినిమా. కానీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. థియేటర్లలో చూడాల్సిన మూవీ ఇది.

10) ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం :

అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ మూవీ కూడా అడవుల బ్యాక్ డ్రాప్లో రూపొందిన మూవీ. సినిమా బాగానే ఉంటుంది కానీ ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడం వల్ల ప్లాప్ అయ్యింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus