ఇండియన్ సినిమాలకు నేషనల్ అవార్డు అనేది ఎంతో ప్రెస్టీజియస్ అవార్డ్ వంటిది అన్న సంగతి తెలిసిందే.ఓ సినిమా కోసం వివిధ విభాగాల్లో పనిచేసే ఫిలిం మేకర్స్ కు ఈ అవార్డు అందుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే నేషనల్ అవార్డు పొందడం అనేది అంత ఈజీ అయితే కాదు. ఇందుకు స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి. సోషల్ ఇష్యూని అడ్రస్ చేసే మూవీ లేదా స్ట్రాంగ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయ్యుండాలి. నటీనటులు అయితే నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లో పెర్ఫార్మన్స్ ఇచ్చి ఉండాలి. అంతేకాదు ఇలా ఎంచుకున్న కంటెంట్ ను జనాలకు రీచ్ అయ్యే విధంగా ఫిలిం మేకర్స్ పాషన్ కూడా కనపడాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది.
నటీనటులు అయినా టెక్నీషియన్ లకు అయినా.. అందరికీ అదే పద్ధతి వర్తిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే మన సౌత్ లో నేషనల్ అవార్డులు అందుకున్న హీరోలు అతి తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడైతే అసలు మన హీరోలకి నేషనల్ అవార్డులు రావడం లేదు అనుకోండి. అలా అని ఆ రేంజ్ కంటెంట్ ఉండటం లేదు, పెర్ఫార్మన్స్ ఉండటం లేదు అని అనడానికి లేదు. తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లిస్ట్ లో కూడా మన హీరోలు ఎవరు లేరు. ఇప్పటివరకు సౌత్ నుండి నేషనల్ అవార్డులు అందుకున్న హీరోలు ఎవరో.. ఏ సినిమాలకు అందుకున్నారో ఓ లుక్కేద్దాం రండి :
1) ఎం.జి.ఆర్ (ఎం.జి రామచంద్రన్) :
1971 వ సంవత్సరంలో వచ్చిన ‘రిక్షాకరన్'(తమిళ్) అనే చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది.
2) పి.జె.ఆంటోనీ :
1973 వ సంవత్సరంలో వచ్చిన ‘నిర్మాల్యం'(మలయాళం) అనే చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది.
3) భరత్ గోపి :
1977 వ సంవత్సరంలో వచ్చిన ‘కొడియెట్టం'( మలయాళం) అనే చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది.
4) బాలన్ కె నాయర్ :
1980 వ సంవత్సరంలో వచ్చిన ‘ఒప్పోల్'( మలయాళం) అనే చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది.
5) కమల్ హాసన్ :
1982 వ సంవత్సరంలో వచ్చిన ‘మూండ్రం పిరై'( తమిళ్) అనే చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది. తెలుగులో ఈ చిత్రం ‘వసంత కోకిల’ గా రిలీజ్ అయ్యింది.
6) మమ్ముట్టి :
1989 వ సంవత్సరంలో వచ్చిన ‘మతైలుకల్ ఒరు వడక్కన్ వీరగీత'( మళయాలం) కి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది.
7) మోహన్ లాల్ :
1991 వ సంవత్సరంలో వచ్చిన ‘భారతం'(మలయాళ) మూవీకి గాను ఈయనకి నేషనల్ అవార్డు లభించింది.
8) మమ్ముట్టి :
1993 వ సంవత్సరంలో వచ్చిన ‘పొంతన మద విదేయన్ ‘(మలయాళ) మూవీకి గాను ఈయనకి మరో నేషనల్ అవార్డు లభించింది.
9) కమల్ హాసన్ :
1996వ సంవత్సరంలో వచ్చిన ‘ఇండియన్ ‘(తమిళ్) చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది. ‘భారతీయుడు’ గా రిలీజ్ అయ్యి తెలుగులో కూడా ఈ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
10) బాలచంద్రన్ మేనన్ :
1997వ సంవత్సరంలో వచ్చిన ‘సమాంతరంగల్'(మలయాళం) చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది.
11) సురేష్ గోపి :
1997వ సంవత్సరంలో వచ్చిన ‘కాలియట్టం’ (మలయాళం) చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది.
12) మమ్ముట్టి :
1998 వ సంవత్సరంలో వచ్చిన ‘బాబాసాహెబ్ అంబేద్కర్'(ఆంగ్ల) చిత్రానికి గాను ఈయనకు మరో నేషనల్ అవార్డు లభించింది.
13) మోహన్ లాల్ :
1999 వ సంవత్సరంలో వచ్చిన ‘వనప్రస్తం'(మలయాళం) చిత్రానికి గాను ఈయనకు మరో నేషనల్ అవార్డు లభించింది.
14) మురళి :
2001 వ సంవత్సరంలో వచ్చిన ‘నేతుకరన్'(మలయాళం) చిత్రానికి గాను ఈయనకు మరో నేషనల్ అవార్డు లభించింది.
15) విక్రమ్ :
2003 వ సంవత్సరంలో వచ్చిన ‘పితామగన్'(తమిళ్) చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది. ఈ చిత్రం ‘శివ పుత్రుడు’ గా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.
16) ప్రకాష్ రాజ్ :
2007 వ సంవత్సరంలో వచ్చిన ‘కాంచీవరం'(తమిళ్) చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది.
17) ధనుష్ :
2010 వ సంవత్సరంలో వచ్చిన ‘ఆడుకలం'(తమిళ్) చిత్రానికి గాను ఇతనికి నేషనల్ అవార్డు లభించింది.
18) సూరజ్ వెంజరమూడు :
2013 వ సంవత్సరంలో వచ్చిన ‘పేరరియతవార్'(మలయాళం) చిత్రానికి గాను ఇతనికి నేషనల్ అవార్డు లభించింది.
19) సంచారి విజయ్ :
2014 వ సంవత్సరంలో వచ్చిన ‘నాను అవనల్ల అవలు'(కన్నడ) చిత్రానికి గాను ఇతనికి నేషనల్ అవార్డు లభించింది.
20) ధనుష్ :
2019 వ సంవత్సరంలో వచ్చిన ‘అసురన్'(తమిళ్) చిత్రానికి గాను ఇతనికి మరో నేషనల్ అవార్డు లభించింది.
21) సూర్య :
2020 వ సంవత్సరంలో వచ్చిన ‘సూరారై పోట్రు'(తమిళ్) చిత్రానికి గాను ఇతనికి నేషనల్ అవార్డు లభించింది.
22) నాగార్జున :
1997 వ సంవత్సరంలో వచ్చిన ‘అన్నమయ్య’ చిత్రానికి గాను ఇతనికి స్పెషల్ మెన్షన్ కేటగిరిలో నేషనల్ అవార్డు లభించింది.