ఈ ఏడాది ఎక్కువ టికెట్లు అమ్ముడైన 10 సినిమాల లిస్ట్..!

  • December 22, 2022 / 01:23 PM IST

ఈ ఏడాది ఎక్కువ టికెట్లు అమ్ముడైంది ఏ సినిమాకో తెలుసా? ఈ ప్రశ్న చాలా మందిలో ఉండే ఉంటుంది. రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ కలెక్షన్స్ ను పట్టించుకోరట. ‘ఫుట్ ఫాల్స్ ను అంటే ఎన్ని టికెట్లు తెగాయి, ఎంత మంది నా సినిమాని చూశారు?’ ఈ విషయాన్నే ఆయన ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారట. ఈ విషయాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రివీల్ చేశారు. రాజమౌళి సినిమాలను నైజాంలో ఎక్కువగా దిల్ రాజు ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ విషయాన్ని ఆయన గ్రహించి రివీల్ చేయడం జరిగింది. సరే రాజమౌళి వంటి గొప్ప దర్శకుడు ఇలాంటి విషయాలపై ఫోకస్ పెట్టాడు అంటే సహజంగానే అందరూ ఈ విషయం పై ఫోకస్ పెడతారు? అందుకే ఈ 2022 లో ఏ సినిమాకి ఎక్కువ టికెట్లు తెగాయి అన్న విషయం పై అందరి దృష్టి పడింది. అందుకే స్వయంగా ‘బుక్ మై షో’ ఈ లిస్ట్ ను రిలీజ్ చేసింది. అయితే ఏ సినిమాకి ఎన్ని టికెట్లు తెగాయి అన్న విషయాన్ని బయటపెట్టలేదు కానీ ఏ సినిమాకి ఎక్కువ టికెట్లు తెగాయి అన్న విషయాన్ని రివీల్ చేసింది. లిస్ట్ లో ఉన్న టాప్ 10 ఇండియన్ మూవీస్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

1) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :

ఈ ఏడాది గ్రాస్ రూపంలో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది ఎక్కువ టికెట్లు అమ్ముడైంది కూడా ఈ సినిమాకేనట..!

2) ఆర్.ఆర్.ఆర్ :

రాజమౌళి – రాంచరణ్ – ఎన్టీఆర్.. కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ ఈ ఏడాది టాప్ 2 గ్రాసర్ గా నిలిచింది.’కె.జి.ఎఫ్ 2′ తర్వాత టికెట్లు ఎక్కువ తెగింది ఈ సినిమాకే..!

3) కాంతార :

రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. టికెట్లు ఎక్కువ అమ్ముడైన సినిమాల లిస్ట్ లో 3 వ ప్లేస్ ను దక్కించుకుంది.

4) ది కశ్మీర్ ఫైల్స్ :

‘అభిషేక్ పిక్చర్స్’ వారు నిర్మించిన ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయ్యింది. రూ.10 కోట్ల బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది . ఈ ఏడాది టికెట్లు ఎక్కువ అమ్ముడైన సినిమాల లిస్ట్ లో 4 వ ప్లేస్ ను దక్కించుకుంది

5) పొన్నియన్ సెల్వన్ పీఎస్-1 :

మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తమిళ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రూ.500 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.ఈ ఏడాది టికెట్లు ఎక్కువ అమ్ముడైన సినిమాల లిస్ట్ లో 5 వ ప్లేస్ ను దక్కించుకుంది ఈ మూవీ.

6) బ్రహ్మాస్త్ర మొదటి భాగం – శివ :

మిక్స్డ్ టాక్ తో కూడా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేసింది. ఈ ఏడాది టికెట్లు ఎక్కువ అమ్ముడైన సినిమాల లిస్ట్ లో 6 వ ప్లేస్ ను దక్కించుకుంది.

7) విక్రమ్ :

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ ఏడాది టికెట్లు ఎక్కువ అమ్ముడైన సినిమాల లిస్ట్ లో 7 వ ప్లేస్ ను దక్కించుకుంది.

8) దృశ్యం 2 :

ఈ ఏడాది బాలీవుడ్లో రిలీజ్ అయిన పెద్ద సినిమాలు అక్కడి బయ్యర్స్ కు పెద్దగా ప్రాఫిట్స్ ను తెచ్చిపెట్టలేకపోయాయి. కానీ ‘దృశ్యం 2’ బాలీవుడ్ పరువు కాపాడింది. ఈ ఏడాది టికెట్లు ఎక్కువ అమ్ముడైన సినిమాల లిస్ట్ లో 8 వ ప్లేస్ ను దక్కించుకుంది ఈ మూవీ.

9) భూల్ భులయ్యా2 :

కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందిన ఈ మూవీ ఈ ఏడాది టికెట్లు ఎక్కువ అమ్ముడైన సినిమాల లిస్ట్ లో 9 వ ప్లేస్ ను సొంతం చేసుకుంది.

10) డాక్టర్ స్ట్రేంజ్ – మల్టీ వెర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ :

ఇది ఇండియన్ మూవీ కాకపోయినప్పటికీ ఇండియాలో ఈ మూవీ ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ మూవీ టాప్ 10 ప్లేస్ ను సొంతం చేసుకుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus