Vaishnav Tej: కుర్ర హీరోలకు షాకిస్తున్న మెగా హీరో..?

సినిమా రంగంలో హీరోగా నటించిన తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ హీరోకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తాయనే సంగతి తెలిసిందే. ఆ కారణం వల్లే సీనియర్ హీరోలు తమ కొడుకుల ఫస్ట్ మూవీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 2020 సంవత్సరం సమ్మర్ లోనే విడుదల కావాల్సిన ఉప్పెన అంతకంతకూ ఆలస్యమవుతూ ఈ ఏడాది రిలీజైంది.

100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను తొలి సినిమాతోనే సాధించి వైష్ణవ్ తేజ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. వైష్ణవ్ తేజ్ రెండో సినిమా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కగా ఈ సినిమాకు క్రిష్ జంగిల్ బుక్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కరోనా విజృంభణ తగ్గితే ఆగష్టులో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

వైష్ణవ్ తేజ్ మూడో సినిమా తమిళ అర్జున్ రెడ్డి డైరెక్టర్ గిరీశయ్య డైరెక్షన్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది. కరోనా ఉధృతి తగ్గితే ఈ సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ సినిమాలతో పాటు ఉప్పెన హిట్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే వైష్ణవ్ తేజ్ రెండు సినిమాలలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అక్కినేని నాగార్జున నిర్మాతగా ఒక సినిమా, పవన్ స్నేహితుడు రామ్ తాళ్లూరి నిర్మాతగా తెరకెక్కే సినిమాలలో కూడా వైష్ణవ్ తేజ్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది.

వరుస సినిమాలతో వైష్ణవ్ తేజ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. వైష్ణవ్ తేజ్ తరువాత సినిమాలు కూడా హిట్టైతే మాత్రం వైష్ణవ్ స్టార్ హీరోగా ఎదగడానికి ఎంతో సమయం పట్టదనే చెప్పాలి. వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటూ వైష్ణవ్ తేజ్ కుర్ర హీరోలకు షాకిస్తూ ఉండటం గమనార్హం.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus