Bigg Boss 5 Telugu: హాస్ లో లోబోకి ఆయనకి గొడవ అవుతుందా..?
- September 10, 2021 / 01:38 PM ISTByFilmy Focus
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఈసారి డిఫరెంట్ గెటప్ తో వచ్చి ఆకట్టుకున్న కంటెస్టెంట్ లోబో. హైదరాబాద్ స్టైల్ లో లోబో లాంగ్వేజ్ వ్యూవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు, లోబో గత రెండురోజుల్నించీ చేస్తున్న ఎంటర్ టైన్మెంట్ కి ఫిదా అయిపోతున్నారు అందరూ. లోబో కరెక్ట్ గా ఇప్పుడు ఫోకస్ చేస్తే టాప్ 5లోకి కూడా వెళ్లిపోయే ఛాన్స్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. సిరికి వచ్చిన పవర్ తో లోబోని సేవకుడిగా, షన్నూని యజమానికి ఎంచుకుంది.
ఇక్కడే షణ్ముక్ చెప్పిన అన్ని పనులని చేస్తూ లోబో తనదైన స్టైల్ ని చూపించాడు. శ్రీరామచంద్ర పాడిన పాటకి వేసిన డ్యాన్స్ ఎపిసోడ్ కి హైలెట్. అంతేకాదు, ర్యాంప్ వాక్ చేస్తూ కెమెరాలకి, బిగ్ బాస్ కి ఐలవ్ యూ చెప్తూ పూర్తిస్థాయి ఎంటర్ టైన్మెంట్ ని చూపిస్తున్నాడు. వాష్ రూమ్ లో ప్రియాంక ఇంకా మనస్ లతో చేసిన ఫన్ కూడా సూపర్ అనే చెప్పాలి. ఇలా తనదైన కామెడీ టైమింగ్ తో చింపేస్తున్నాడు. అయితే, లోబో ఇలాగే కొన్ని టాస్క్ లు ఆడితే అందర్నీ ఓవర్ టేక్ చేయడం అనేది పక్కా.

మరోవైపు లోబోకి నటరాజ్ మాస్టర్ కి పెద్దగా పడదని టాక్. ఇలాగే లోబో డామినేట్ చేస్తూ, ఏదైనా టాస్క్ లో గొడవచేస్తే మాత్రం నటరాజ్ మాస్టర్ కి లోబోకి పెద్ద గొడవే అవుతుంది. అందుకే, లోబో శృతిమించకుండా కామెడీ చేసినంతవరకూ బాగానే ఉంటుంది. ఎక్కడైనా ఓవర్ గా వెళ్లిందా.. వెంటనే బాణాలేసేందుకు హౌస్ మేట్స్ సిద్ధంగానే ఉంటారు. అదీ మేటర్.
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
[yop_poll id=”2″]
Most Recommended Video
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!














