సమంత, శర్వాల ‘జాను’ టైటిల్ వెనుక లాజిక్ అదే..!

  • January 8, 2020 / 01:25 PM IST

2018లో విడులైన తమిళ చిత్రం ’96’ సంచలన విజయం నమోదు చేసింది. చిన్న వయసులోనే ఒకరంటే మరొకరికి ప్రాణం అన్నంతగా ప్రేమించుకొని..అనుకోని కారణాల వలన విడిపోయిన జంట, కొన్నేళ్ల తరువాత కలిస్తే.. వారి ప్రస్తుత నేపధ్యాల వలన మళ్ళీ కలవలేని సంధర్భంలో వారి మధ్య నడిచే మానసిక సంఘర్షణల… సమాహారమే 96 చిత్రం. ఈ చిత్రానికి 96అని టైటిల్ పెట్టడానికి కారణం. వాళ్లిద్దరూ 1996 పదవ తరగతి బ్యాచ్ కి చెందినవారు. అందుకే ఆ చిత్రానికి 96అని టైటిల్ పెట్టడం జరిగింది.

కాగా ఈ చిత్రాన్ని తెలుగులో హీరో శర్వానంద్, సమంత జంటగా చేస్తున్నారు. నేడు ఈ చిత్ర టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి జాను అనే టైటిల్ నిర్ణయించడం జరిగింది. టైటిల్ పోస్టర్ లో మెడలో కెమెరా, వెనుక బ్యాగ్ తగిలించుకొని ఎడారిలో ఒంటరిగా ఒంటెలను లాక్కెళుతున్న శర్వా లుక్ ఆసక్తికరంగా ఉంది. ఐతే తమిళంలో 96 టైటిల్ తో విడుదలైన ఈ చిత్రానికి తెలుగులో జాను అని టైటిల్ నిర్ణయించడానికి కారణం లేకపోలేదు. దాని వెనుక లాజిక్ ఏమిటంటే…?

ఒరిజినల్ తమిళ చిత్రం 96లో హీరోయిన్ త్రిష పేరు జానకి. బేసిక్ గా మంచి సింగర్ కావడంతో పాటు.. లెజెండరీ సింగర్ ఎస్ జానకి అభిమాని కావడంతో ఆమె ఆ పేరు పెట్టుకుంటుంది. కాబట్టి జానకి పేరును ముద్దుగా జాను అనిపిలుస్తూ ఉంటారు. అలా ఈ చిత్రానికి హీరోయిన్ సమంత పాత్ర పేరుని పెట్టారు. నిజానికి 96మూవీ మొత్తం త్రిషా, విజయ్ సేతుపతి చుట్టూనే తిరుగుతుంది. ఐతే త్రిషా పాత్ర కంటే కూడా విజయ్ పాత్రకి చాలా డెప్త్ మరియు ప్రాధాన్యత ఉంటుంది. అలాంటప్పుడు హీరోయిన్ సమంత రోల్ నేమ్ టైటిల్ గా పెట్టడం వెనుక కారణం ఏమిటో..? ఒరిజినల్ 96 చిత్రానికి దర్శకత్వం వహించిన సి ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus