చేతి కర్రలతో ఏడు కొండలెక్కిన ‘లియో’ లోకేష్ అండ్‌ టీమ్!

ఏదైనా శుభకార్యం తలపెట్టే ముందు తిరుమల వేంకటేశ్వరుడిని సందర్శించుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఏ ఒక్కరో చేసే పని కాదు. దేశంలో చాలామంది ఇదేపని చేస్తుంటారు. అయితే సినిమా వాళ్లు తమ ప్రాజెక్ట్ రిలీజ్‌కి దగ్గరగా ఉన్నప్పుడు, సినిమా రిలీజ్‌ అయిన తర్వాత తిరుమల వస్తుంటారు. ఈ క్రమంలో ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ తిరుమల వచ్చారు. అది కూడా తన టీమ్‌తో కలసి కాలినడకన కొండెక్కి శ్రీవారిని దర్శించుకున్నారు.

దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విజయ్‌తో లోకేశ్ తెరకెక్కించిన ‘లియో’ సినిమా ఈ నెల 20న విజయ దశమి సందర్భంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో లోకేశ్‌ తన టీమ్‌తో తిరుమల వచ్చినట్లు సమాచారం. గురువారం మెట్ల మార్గం ద్వారా కాలినడక లోకేశ్‌ అతని బృందం తిరుమలకు చేరుకున్నారు. లోకేష్ కనగరాజ్ టీమ్‌ సభ్యులంతా దేవస్థానం అందించిన చేతికర్రలతో మెట్లెక్కుతున్నారు. టీటీడీ సిబ్బంది కూడా రక్షణ కల్పించారు అని వీడియోల్లో తెలుస్తోంది.

తిరుమల మెట్ల మార్గంలో ఒక చిన్నారిని ఇటీవల ఓ చిరుత పులి పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎవరు మెట్ల మార్గంలో వెళ్లినా టీటీడీ వారికి చేతికర్రలను ఇస్తోంది. అలా లోకేశ్‌ టీమ్‌కి కూడా ఇచ్చింది. దీంతో వారు ఆ కర్రలను చేతబట్టుకుని గోవింద నామ స్మరణ చేస్తూ తిరుమల మెట్లెక్కారు. విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

‘మాస్టర్‌’ సినిమాతో ఇప్పటికే విజయ్‌ – లోకేశ్‌ అదిరిపోయే సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు ‘లియో’ రెండో సినిమాగా రాబోతోంది. దాంతోపాటు ఈ సినిమా ‘ఎల్‌సీయూ’లో భాగం అంటున్నారు. దీంతో ఇందులో ఓ స్పెషల్‌ ఎలిమెంట్‌ కచ్చితంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ ఎలిమెంట్‌ రామ్‌చరన్‌ అని ఓ టాక్‌ కూడా నడుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది. త్వరలోనే అంటే సినిమా వచ్చాకనే అని చెప్పొచ్చు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus