సౌత్ సినిమా బిగ్ డైరెక్టర్స్ లో ఒకరైన లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఇప్పుడు సినిమాల్లోనే కాదు, క్లాస్ రూమ్ లో కూడా మాస్టరే అవుతున్నారు. విక్రమ్ (Vikram), ఖైదీ(Kaithi) , మాస్టర్(Master) , లియో (LEO) వంటి హిట్ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న లోకేష్, ప్రస్తుతం రజనీకాంత్‌తో(Rajinikanth) కూలీ (Coolie) అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. అయితే అంత బిజీ షెడ్యూల్‌లో ఉన్న ఆయన తాజాగా ఓ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేయబోతున్నారు. అక్కినేని నాగార్జున (Nagarjuna) నిర్వహించే అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా వారు ఏప్రిల్ 4న ప్రత్యేక చలనచిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ని చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు. సినిమా నిర్మాణం, డైరెక్షన్ పై ఓ ఇంటరాక్టివ్ సెషన్‌ను విద్యార్థులకు అందించబోతున్నారు. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించడంతోనే సోషల్ మీడియాలో పెద్ద హైప్ మొదలైంది. లోకేష్ క్లాస్ అంటేనే ఫ్యాన్స్‌తో పాటు ఫిల్మ్ స్టూడెంట్స్ లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. యాక్షన్, స్క్రీన్ ప్లే, టేకింగ్‌లో విభిన్నతను చూపించే లోకేష్.. ఆయన పనితీరును నేరుగా వింటే ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది.
స్టూడెంట్స్‌తో తన అనుభవాలను పంచుకోవడం, ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనుకునే వారికి దిశానిర్దేశం చేయడం వంటి అంశాలపై లోకేష్ స్పష్టంగా మాట్లాడబోతున్నారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా ఇప్పటికే దేశంలోనే అత్యుత్తమ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. నాగార్జున ఆధ్వర్యంలో ఈ కాలేజ్ తరచూ ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్ సెలబ్రిటీలను స్టూడెంట్స్‌కు ప్రత్యేక శిక్షణ కోసం ఆహ్వానిస్తూ వస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా క్రేజ్ ఉన్న లోకేష్ కనగరాజ్ చేరడం విశేషమే.
ఇదే సమయంలో కూలీ (Coolie) మూవీ ద్వారా తొలిసారి నాగార్జున, లోకేష్ కాంబో కూడా మనకు కనిపించబోతోంది. దాంతో ఈ సందర్బంగా వారి మధ్య స్పెషల్ బాండింగ్ కూడా అందరికీ ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, లోకేష్ అక్కినేని క్యాంపస్ లో మాస్టర్ క్లాస్ ఇవ్వడమే కాకుండా, తన డైరెక్షన్ స్పూర్తితో స్టూడెంట్స్‌ను ఊహించని మోతాదులో మోటివేట్ చేయబోతున్నారు.