RRR Theatres: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టికెట్‌లతో ఫ్యాన్స్‌ జేబు గుల్ల చేస్తున్నారట

మేం భారీ బడ్జెట్‌తో సినిమాలు తీస్తున్నాం… మీరేమో పదులు, ముప్పైలు అని టికెట్‌ రేట్లు పెడుతున్నారు. ఇలా అయితే ఇండస్ట్రీ బతికేదెలా? ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వరకు టాలీవుడ్‌ ప్రముఖులు ఈ మాటే అంటూ వచ్చారు. వారి మొర విన్న ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రేట్లు పెంచుకోవడానికి అవకాశమిచ్చారు. హమ్మయ్య ఇండస్ట్రీ నెత్తిన పాలు పోశారు, మాకు ప్రాణం లేచొచ్చింది అంటూ ఆనందపడ్డారు టాలీవుడ్‌ జనాలు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ అయ్యాక చూస్తే… వాళ్ల నెత్తిన పాలేమో కానీ, ప్రేక్షకుల నెత్తిన మాత్రం పిడుగు వేశారు. నిజానికి తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

Click Here To Watch NOW

‘భీమ్లా నాయక్‌’ సినిమా విడుదల సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల పరిస్థితి ఒకలా ఉండేది. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి వచ్చేసరికి ఇంకోలా ఉంది. టికెట్‌ రేట్లు, షోల విషయంలో ‘భీమ్లా నాయక్‌’కు ప్రభుత్వం గట్టి నిఘానే పెట్టింది. అధికారులతో ఎప్పటికప్పుడు తనిఖీలు, పెట్రోలింగ్‌లు లాంటివి పెట్టించింది. దీంతో తక్కువ ధరకే, నిర్ణయించిన షోలకే సినిమా వేశారు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి చూస్తే అనుమతి లేకుండా కూడా కొన్ని చోట్లు ఉదయం 6 – 7 మధ్య షోలు పడ్డాయని టాక్‌.

ఇక థియేటర్ల దగ్గర బ్లాక్‌ టికెట్‌ల సమస్య మామూలుగా లేదు. కౌంటర్‌లో టికెట్‌ రేటుకు డబుల్‌ చేసి మరీ అమ్మారు అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో టికెట్‌ రేట్లు కొంచెం ఎక్కువే. అయినా థియేటర్‌ యజమానులు వెనక్కి తగ్గడం లేదు. టికెట్లను కౌంటర్‌లో ఒక రేటుకు, బయట ఇంకో రేటుకు అమ్ముతున్నారు. ధర ప్రింట్‌కి డబుల్ ఉంటోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు నెటిజన్లు. మల్టీప్లెక్స్‌ల విషయం పక్కనపెడితే… సింగిల్‌ థియేటర్లలో ఈ దోపిడీ కనిపిస్తోందట. మామూలుగానే థియేటర్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ధర పెంచేశారు. ఇప్పుడు దానికి ఇంకా పెంచుతున్నారు థియేటర్ల వాళ్లు.

దీంతో తెలంగాణలో సింగిల్‌ థియేటర్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సందడి అంతంతమాత్రమే అని అంటున్నారు. చాలా థియేటర్లలో శనివారం ఉదయం పెద్దగా రద్దీ కనిపించడం లేదు. అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్నవాళ్లు తప్ప, కౌంటర్‌ టికెట్ల విషయంలో నిరాశే అని అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. టికెట్‌ ధరలే ‘ఆర్‌ఆర్ఆర్‌’ను ఇబ్బంది పెడతాయా? అంటూ ఈ మధ్య వస్తున్న ప్రశ్న నిజమయ్యేలా కనిపిస్తోంది. ఇది పక్కన పెడితే ప్రభుత్వాలు అవకాశం ఇచ్చాయి కదా అని, థియేటర్లు, ఎగ్జిబిటర్లు ఇలా ప్రేక్షకుల నుండి పిండుకోవడం ఏం బాగోలేదు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus