రాజమౌళితో (S. S. Rajamouli) సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు సెట్స్‌లో సినిమా ఉంటుంది, ఆ సినిమా టీమ్ అంతా ఆ సినిమా కోసం స్టిక్ అయిపోవాల్సి వస్తుంది. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతూ ఉంది. ‘బాహుబలి’ (Baahubali) సినిమాలు, ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా సమయంలో మనం ఇది చూశాం కూడా. ‘బాహుబలి’ కోసం ప్రభాస్, (Prabhas) రానా (Rana Daggubati).. ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం రామ్‌చరణ్ (Ram Charan), తారక్ (Jr NTR) కొన్నేళ్లు రాజమౌళికి తమ డేట్స్ రాసిచ్చేశారు. ఆయన చాలా రోజులు కష్టపడి ఆ సినిమాలు పూర్తి చేశారు. అయితే మహేష్‌బాబు సినిమా విషయంలో ఈ లైన్ మిస్ అవుతోందా?
ఏమో మహేష్‌బాబు (Mahesh Babu) చేసిన పని చూస్తే ఎవరికైనా ఇదే అర్థమవుతుంది. ఎందుకంటే మహేష్ బాబు విదేశాలకు వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ నా పాస్‌పోర్టు నాకొచ్చేసింది అన్నట్లు చూపించి మరీ వెళ్లాడు. మహేష్ ఎక్కడి వెళ్లాడు, ఇప్పుడెందుకు వెళ్లాడు అనే విషయం ఎవరూ అడగక్కర్లేదు. ఎందుకంటే ఆయన రెండు, మూడు నెలలకు ఒకసారి విదేశాలకు ట్రిప్‌లకు వెళ్తూ ఉంటాడు. అలా ఇప్పుడు కూడా తన తనయుడు దగ్గరకు వెళ్లి ఉంటాడు. ఆ విషయం కాదు కానీ.. ఇప్పుడు సమస్య సినిమా సంగతేంటి అని.
ఎందుకంటే రాజమౌళి – మహేష్‌బాబు సినిమా స్టార్ట్ అవుతోంది అనగానే మనకు వినిపించిన మొదటి డౌట్.. అన్ని రోజులు మహేష్ బయటకు ఎక్కడకూ వెళ్లకుండా కామ్‌గా ఉంటాడా అని. అలాగే యాడ్స్‌లో నటించకుండా, లుక్ బయట పెట్టకుండా ఉంటాడా? అని. ఆ మాటకు మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మా హీరో డెడికేషన్‌నే మీరు తప్పుపడతారా అంటూ ఫ్యాన్ వార్స్ జరిగాయి. ఇప్పుడు చూస్తే మహేష్ సినిమా షెడ్యూల్స్ మధ్యలో ట్రిప్‌కి వెళ్లిపోయాడు అంటూ ఇతర హీరోల ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
మొన్నామధ్య పర్సనల్ పని ఉందంటూ.. హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గ్యాప్ ఇచ్చేసింది. ‘ఎల్ 2: ఎంపురాన్’ (L2: Empuraan) పనులు ఉన్నాయంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు మహేష్ ట్రిప్ గ్యాప్ తీసుకున్నాడు. దీంతో ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో అనేది రాజమౌళికే తెలియాలి.