గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా ‘లౌక్యం’. వీరి కాంబినేషన్లో అంతకు ముందు ‘లక్ష్యం’ మూవీ వచ్చింది. ఆ మూవీ అప్పటికి గోపీచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ‘లౌక్యం’ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. 2014 వ సంవత్సరం సెప్టెంబర్ 26న ఈ మూవీ రిలీజ్ అయ్యింది.
మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ అప్పటికి గోపీచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 8 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో #8YearsForLoukyam అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉండగా.. ఫుల్ రన్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
7.38 cr
సీడెడ్
2.90 cr
ఉత్తరాంధ్ర
2.70 cr
ఈస్ట్
1.30 cr
వెస్ట్
1.02 cr
గుంటూరు
1.85 cr
కృష్ణా
1.32 cr
నెల్లూరు
0.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
19.17 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +తమిళనాడు
1.92 cr
ఓవర్సీస్
0.75 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
21.84 cr
‘లౌక్యం’ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ ఫుల్ రన్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.21.84 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా బయ్యర్స్ కు ఈ మూవీ రూ.3.84 కోట్ల లాభాలను అందించి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ 8 ఏళ్లలో గోపీచంద్ నటించిన ఏ మూవీ కూడా ‘లౌక్యం’ కలెక్షన్లను అధిగమించలేకపోవడం గమనార్హం.