సంగీత్ - సిద్ధార్థ్ హల్దీపూర్ - శ్రీ శ్రీరామ్ (Music)
సిజిమోన్ లెంకోవిస్కీ (Cinematography)
Release Date : సెప్టెంబర్ 28, 2024
నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ అయ్యాక అక్కినేని కుటుంబంలో భాగస్వామి కాబోతున్న శోభిత ధూళిపాళ నటించిన కొత్త హిందీ సినిమా “లవ్, సితార”. వందన కటారియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ & కంటెంట్ ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ మెచ్యూర్డ్ ఆడియన్స్ అని ప్రూవ్ చేసింది. జీ5 యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
Love, Sitara Review
కథ: సక్సెస్ ఫుల్ కెరీర్, అర్థం చేసుకునే తల్లిదండ్రులు, గుడ్డిగా ప్రేమించే ప్రియుడు, మంచి స్నేహితులు.. ఇలా అన్నీ విషయాల్లోనూ సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తుంటుంది సితార (శోభిత ధూళిపాళ). అయితే.. ఒకరోజు తాను గర్భవతి అయ్యాను అని తెలుసుకొని వెంటనే అమ్మమ్మ ఇంట్లో నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. అందర్నీ ఒప్పించి, కేరళలోని అమ్మమ్మ ఇంటికి రప్పించి పెళ్లి పనులు మొదలుపెడుతుంది.
అంతా సజావుగా సాగుతుంది అనుకునే సమయానికి సితార బుర్రలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. సితార ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో కుటుంబంలో కొన్ని చీలికలు ఏర్పడతాయి. ఇంతకీ సితార పెళ్లి జరిగిందా? అసలు సితార మనసులో రేగిన ప్రశ్నలు ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “లవ్, సితార” చిత్రం.
నటీనటుల పనితీరు: సినిమాలో బోలెడు మంది ఆర్టిస్టులున్నా అందరికంటే ఎక్కువగా అలరించింది మాత్రం సీనియర్ హీరోయిన్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ బి.జయశ్రీ అమ్మమ్మ పాత్రలో ఆమె నటన, ఆమె డైలాగ్స్ చాలా బాగున్నాయి. పెద్దావిడ పాత్రకు కరెంట్ జనరేషన్ కూడా కనెక్ట్ అవుతారు. శోభిత ఒక హానెస్ట్ & ఇండిపెండెంట్ ఉమెన్ పాత్రలో ఆకట్టుకుంది. ఆమె క్యారెక్టర్ ఆర్క్ బాగుంది. ప్రెజెంట్ జనరేషన్ ఆలోచన విధానానికి కు సితార పాత్ర అద్దం పడుతుంది. చాలామంది రిలేట్ అవుతారు కూడా.
హేమ పాత్రలో సోనాలి కులకర్ణి సినిమాలో మరో చెప్పుకోదగ్గ పాత్ర. బోల్డ్ మైండ్ సెట్ కి బరితెగించడానికి మధ్య ఉన్న చిన్నపాటి తేడాను ఈ పాత్రతో వివరించిన తీరు బాగుంది. రాజీవ్ సిద్ధార్థ, సంజయ్ భూటియానాలు సపోర్టింగ్ రోల్స్ లో అలరించారు. వారి పాత్రల ద్వారా చెప్పిన చిన్నపాటి నీతి కథలు బాగా ఎలివేట్ అయ్యాయి.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకురాలు వందన కటారియా ఒక సగటు ఆధునిక భారతీయ కుటుంబంలోని లోపాలను మొహమాటం లేకుండా తెరపై ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. అవకాశం ఉన్నా ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా, శృంగార సన్నివేశాలు ఇరికించకుండా.. డీసెంట్ గా బోల్డ్ టాపిక్స్ ను డిస్కస్ చేసిన విధానం ప్రశంసనీయం. చాలా సరదాగా పెట్టుకొని ఎఫైర్లు ఓ కుటుంబాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనే విషయాన్ని చాలా పాజిటివ్ గా చెప్పిన విధానం సినిమాకి మెయిన్ హైలైట్. ప్రతి పాత్రలోనూ ఓ భావోద్వేగం ఉంది.
ముఖ్యంగా అమ్మమ్మ పాత్ర, తల్లి పాత్ర, పిన్ని పాత్రల ద్వారా మహిళా సాధికారత (ఉమెన్ ఎంపవర్మెంట్) అంటే ఏమిటో చాలా హృద్యంగా చూపించిన విధానం ప్రశంసనీయం. అన్నిటికీ మించి అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉండడం అంటే ఇష్టమొచ్చినట్లుగా ఉండడం కాదని, నిజాయితీతో కూడిన బాధ్యతతో వ్యవహరించడం అని, తమకు కావాల్సిన వాళ్లు తప్పు చేసినప్పుడు వారిని దూరం చేసుకోకుండా, క్షమించి వారు మరోసారి తప్పు చేయకుండా చూసుకోవడం అనే పాయింట్స్ ను ఎక్కడా ఓవర్ డ్రామా లేకుండా వివరించిన విధానం బాగుంది.
సినిమాటోగ్రఫీ వర్క్, మ్యూజిక్, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ డీసెంట్ గా ఉన్నాయి. సినిమాలో ఎక్కడా అసహజత్వం కనిపించకుండా బృందం మొత్తం తీసుకున్న జాగ్రత్త ప్రేక్షకులకు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.
విశ్లేషణ: ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక పైకి చెప్పుకోలేని సమస్య ఉంటుంది. ఆ సమస్యను పెద్దది చేసుకోకుండా, గుర్తించి పరిష్కరించుకోవడం అనేది ఎంత ముఖ్యం అనే విషయాన్ని మోడ్రన్ ఫ్యామిలీ కల్చర్ ద్వారా వివరించిన సినిమా “లవ్, సితార”. వందన కటారియా టేకింగ్ & ఐడియాలజీ & మహిళా పాత్రధారుల సహజమైన నటన & ఆలోజింపజేసే డైలాగుల కోసం కుటుంబంలో అందరూ కలిసి చూడదగ్గ వెబ్ ఫిలిం “లవ్ సితార”.
ఫోకస్ పాయింట్: బోల్డ్ & బ్యూటిఫుల్ “లవ్, సితార”.
రేటింగ్: 3/5
Rating
3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus