శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ చిత్రం నిజానికి ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల వాయిదా పడింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, పాటలు వంటివి కూడా ఆకట్టుకోవడంతో అంచనాలు మరింత పెరిగాయి అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది అలాగే థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి అనే అంశాల పై ఇటీవల ‘లవ్ స్టోరీ’ నిర్మాత మరియు ప్రముఖ ‘ఏషియన్’ ఎగ్జిబిటర్ అయిన సునీల్ నారంగ్ క్లారిటీ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు సడలించినా.. ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రిపూట కర్ఫ్యూ పూర్తిగా తొలగించిన తర్వాతే ఎవరైనా సినిమా విడుదల విషయం ఆలోచిస్తారు. 3 ప్రదర్శనలతో థియేటర్లను నడిపించడానికి ఎవరు ముందుకు రారు. అలాగే సినిమా నిర్మాతలు కూడా తమ సినిమాలను విడుదల చేయాలనుకోరు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా పరిస్థితులు, హాళ్లు తెరవడానికి అనుకూలంగా ఉండాలి కదా! జూలై రెండో వారానికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నాం.
ఒకవేళ థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు లభించినా.. నైట్ కర్ఫ్యూ తీసేసిన తర్వాతే కొత్త సినిమాలు విడుదలవుతాయి. మా ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని నైట్ కర్ఫ్యూ తీసిన వారం రోజుల తర్వాత విడుదల చేయాలని అనుకుంటున్నాం” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?