యూత్ ను ఆకట్టుకునే సినిమాలు చాలానే వచ్చాయి.. వస్తున్నాయి కూడా..! అయితే యూత్ ఫుల్ సినిమాలు చూసినప్పుడు మేకర్స్ చాలా జాగ్రత్త వహించాలి. తేడా కొడితే యూత్ ను పక్క దోవ పట్టించే వ్యక్తులు వాళ్ళే అవుతారు. యూత్ఫుల్ సినిమాలు అంటే లవ్, రొమాన్స్.. వీటినే ప్రధానంగా తీసుకుని సినిమాలు చేసే దర్శకులు ఉన్నారు. కానీ ప్రెజంట్ జెనరేషన్ యూత్ బాగా అట్రాక్ట్ అయ్యేది.. అవుతుంది.. కూడా స్మార్ట్ ఫోన్లకనే చెప్పాలి.
చేతిలో ఫోన్.. ఇంటర్నెట్ ఉంటే చాలు ప్రపంచాన్నే మర్చిపోతున్నారు కుర్రకారు. ఈ అంశం పైనే తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ టుడే’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా కథంతా ఫోన్, సోషల్ మీడియా ఖాతాల చుట్టూనే తిరుగుతుంది. డీప్ లవ్ లో ఉన్న ప్రేమికులు.. అందులోనూ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నవారు.. ఉంగరాలకు బదులు ఫోన్లు మార్చుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది ఈ చిత్రం కథ.
తాను తీసిన ఓ షార్ట్ ఫిలింని ఎక్స్టెండ్ చేసి ఈ చిత్రాన్ని తెరక్కించాడు ప్రదీప్. సినిమా హిట్ అయ్యింది. బాగా డబ్బులు వచ్చాయి. అయితే ఈ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇటీవల ఓ జంట నిశ్చితార్థం రోజున తమ ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అంతే పెళ్ళికొడుకు బాగోతం మొత్తం బయటపడింది. తనకు కాబోయే భార్య కమ్ ప్రియురాలు.. అతని ఫోన్ చూసినప్పుడు ఓ చిన్నపిల్ల నగ్న వీడియో బయటపడిందట.
దీంతో కాబోయే పెళ్లి కూతురు ఆ ఫోన్ ను పోలీసులకు అప్పగించగా.. దానిని ఆధారం చేసుకుని వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసినట్టు వినికిడి. ఈ ఇన్సిడెంట్ తో వీరి పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యింది.