Shehzada: కార్తీక్ ఆర్యన్ ‘షెహజాదా’కి బుకింగ్స్ లేవు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ‘అల వైకుంఠపురములో’. నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొచ్చింది ఈ సినిమా. దీన్ని హిందీలో ‘షెహజాదా’ అనే పేరుతో రీమేక్ చేశారు. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఒరిజినల్ కి మక్కీకి మక్కీ దించేశారని స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే నేటివిటీ మిస్ అయిందని.. బన్నీ స్టైల్ ని కార్తీక్ మ్యాచ్ చేయలేకపోయారని కామెంట్స్ వచ్చాయి.

బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతిసనన్ ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించబోతుంది. పాటలు చూస్తుంటే ఆమె ఏ రేంజ్ లో గ్లామర్ ఒలకబోసిందో అర్ధమవుతోంది. మరో మూడు రోజుల్లో విడుదల ఉన్నా.. అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం సోసోగానే ఉన్నాయి. హాలీవుడ్ మూవీ ‘యాంట్ మ్యాన్ 3 క్వంటం మానియా’ సినిమా టికెట్స్ అమ్మకాలు దీనికంటే భారీగా ఉన్నాయి. రెండింటి మధ్య వ్యత్యాసం చాలానే కనిపిస్తోంది. దీంతో బయ్యర్లు టెన్షన్ పడుతున్నారు.

ఫిబ్రవరి 10న రావాల్సిన ‘షెహజాదా’ సినిమా ‘పఠాన్’ జోరు చూసి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడేమో పరిస్థితి ఇలా ఉంది. కరెంట్ బుకింగ్స్ తో పాటు ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వచ్చేవరకు కలెక్షన్స్ ఊపందుకునేలా లేవు. ఇదంతా ఎలా ఉన్నా.. రీమేక్ కి మూడేళ్ల సమయం పట్టడం ఇలాంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంది. ‘పుష్ప’తో అల్లు అర్జున్ కి నేషనల్ వైడ్ ఇమేజ్ వచ్చిన తర్వాత అందరూ ఆయన సినిమాలను ఓటీటీల్లో చూసేస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ‘అల.. వైకుంఠపురములో’ సినిమాని ఇప్పటికే చాలా మంది చూసేశారు. అది కూడా ‘షెహజాదా’పై ప్రభావం చూపిస్తోంది. ఈ సినిమాలో అల్లు అరవింద్ తో పాటు ఎస్ రాధాకృష్ణ నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. టబు పాత్రను మనీషా కొయిరాలా పోషించగా మురళీశర్మగా పరేష్ రావల్, సచిన్ కెడ్కర్ పాత్రను ఆయనే పోషిస్తున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus