‘ఊ అంటావా ఊఊ అంటావా’.. పాట పై సీనియర్ సింగర్ షాకింగ్ కామెంట్స్

  • March 8, 2023 / 04:15 PM IST

2021 డిసెంబర్ లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయ్యింది ఈ మూవీ. ముఖ్యంగా హిందీలో రూ.100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ను సాధించింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీకి సుకుమార్ దర్శకుడు. నిజానికి ఈ మూవీ ఇంత సూపర్ హిట్ అవ్వడానికి కారణం.. ఈ చిత్రం సమంత చేసిన ‘ఊ అంటావా ఊఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ అనే చెప్పాలి.

ఈ పాట రిలీజ్ అయినప్పటి నుండి సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. సమంతకి ‘ఫ్యామిలీ మెన్’ తో వచ్చిన ఇమేజ్ వల్ల ఈ పాట నార్త్ లో ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ పాట వల్ల చాలా కాంట్రవర్సీలు ఏర్పడ్డాయి. ఈ పాట పై కొంతమంది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట పై నెగిటివ్ కామెంట్స్ చేసింది సీనియర్ గాయని ఎల్ ఆర్ ఈశ్వరి. ‘మసక మసక చీకటిలో’ ‘భలే భలే మగాడివోయ్’ అంటూ ఐటెం సాంగ్స్ పాడి ఈమె బాగా పాపులర్ అయ్యింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ” ‘ఊ అంటావా ఊఊ అంటావా’ పాట కూడా ఓ పాటేనా? కాంపొజిషన్ కానీ, గానం కానీ చివరి వరకు ఒకే పిచ్ పై ఉంటుంది. గాయకులు తప్పు పాడితే మ్యూజిక్ డైరెక్టర్ సరిచేయాలి. ఆ పాట పాడే అవకాశం నాకు వచ్చి ఉండుంటే ఇంకా బాగా పాపులర్ అయ్యేది” అంటూ కామెంట్లు చేసింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus