ఫ్యాన్సీ రేటుకి అమ్ముడైన ‘ఆర్ఆర్ఆర్’!

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అయితే బాహుబలి రేంజ్ లో ఈ సినిమాకి బిజినెస్ జరుగుతుందా..? అనే సందేహాలు ఉండేవి. ఎందుకంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు లేదు. కానీ ‘ఆర్ఆర్ఆర్’పై రోజురోజుకి జనాల్లో క్రేజ్ పెరిగిపోతుంది. దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల నుండి కూడా భారీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.

రామ్ చరణ్, ఎన్టీఆర్ తమిళ ప్రేక్షకులను పెద్దగా పరిచయం లేనప్పటికీ.. ‘ఆర్ఆర్ఆర్’ తమిళ హక్కుల కోసం భారీ మొత్తంలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే లైక్ ప్రొడక్షన్స్ సంస్థ ‘ఆర్ఆర్ఆర్’ తమిళ వెర్షన్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాని కోసం ఏకంగా రూ.45 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఒక్క రాజమౌళి పేరుతోనే ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. పబ్లిసిటీ, ఇతర ఖర్చులు కలుపుకుంటే ఈ సినిమాకి తమిళంలో రూ.50 కోట్ల షేర్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

యాభై కోట్ల షేర్ అంటే మామూలు విషయం కాదు. కానీ రాజమౌళి తనపై పెట్టుకున్న అంచనాలను అందుకుంటాడనే నమ్మకంతో ఉన్నారు. పైగా లైకా సంస్థ తమ సినిమాలకు సంబంధించి పబ్లిసిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కాబట్టి ఈ సినిమా కోలీవుడ్ లో భారీ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న సినిమాను విడుదల చేయనున్నారు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus